Telangana News: 'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
Sakshi News home page

'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!

Sep 9 2023 1:44 AM | Updated on Sep 9 2023 8:58 AM

- - Sakshi

మాట్లాడుతున్న సుజిత్‌ కుమార్‌

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్‌ నిర్యాత్‌ కేంద్ర సర్వీస్‌ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్‌ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్‌ సబ్‌ డివిజన్‌ ఇన్స్‌పెక్టర్‌ సుజిత్‌కుమార్‌ తెలిపారు.

శుక్రవారం ఉట్నూర్‌ పరిధిలోని బ్రాంచి పోస్ట్‌ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్‌ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్‌ సర్వీస్‌ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్‌, బీపీఎంలు చంద్రశేఖర్‌, ప్రవీన్‌, గోకు ల్‌, విజయ్‌, సాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement