Telangana Crime News: మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!
Sakshi News home page

మాయమాటలు చెప్పి.. మోసం చేశాడు..!

Sep 7 2023 2:02 AM | Updated on Sep 7 2023 8:39 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: ఘరానా మోసగాడు దంపతులకు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు కాజేసిన సంఘటన మండలంలోని కన్కపూర్‌ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు నాగన్న అనే రైతు ఇంటికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్‌ బైక్‌పై వచ్చాడు. నాగన్న–లక్ష్మి దంపతులతో నేను బ్యాంకు నుంచి వచ్చాను.

మీరు ఇంతకు ముందు బ్యాంకులో గోల్డ్‌లోన్‌ తీసుకున్నారుగా, మీకు లోన్‌ మాఫీ వచ్చిందని, మరింతగా రెట్టింపు లోన్‌ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నమ్మిన ఆ దంపతులు లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును భర్త నాగన్నకు ఇచ్చింది. నాగన్నను అతడి బైక్‌పై ఎక్కించుకుని అబ్దుల్లాపూర్‌ గ్రామ పరిధిలోని సబ్‌స్టేషన్‌ వరకు తీసుకెళ్లి అతడి వద్ద నుంచి గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement