రూట్‌మ్యాప్ పరిశీలిస్తున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
● ఎస్పీ డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: శ్రీరామనవమి శోభాయాత్ర ప్ర శాంతంగా సాగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో గురువారం నిర్వహించనున్న శోభా యాత్ర రూట్ మ్యాప్‌ను మంగళవారం ఆయన పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ర్యాలీ చేపట్టనున్న కమిటీ సభ్యులతో వన్‌టౌన్‌లో సమావేశం నిర్వహించారు. ఇరువర్గాలకు కేటాయించిన సమయాల్లో ర్యాలీలను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. డీజేకు అనుమతి లేదన్నారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పాటలు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రెండు ర్యాలీలు నిర్వహించే ప్రతి నిధులు, ఓఎస్‌డీ బి.రాములునాయక్, డీఎస్పీ ఉమేందర్, సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ అశోక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


