‘జ్యోతిర్మయి వ్రతం’ రద్దు | - | Sakshi
Sakshi News home page

‘జ్యోతిర్మయి వ్రతం’ రద్దు

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం నిర్వహించేందుకు గతంలో ఇచ్చిన ఆదేశాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ రద్దు చేశారు. గత ఏడాది ఎస్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ ఈఓగా ఉన్నప్పుడు జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం ప్రారంభించేందుకు కమిషనర్‌ అనుమతి ఇచ్చారు. దాంతో రామాలయం వద్ద అకౌంట్స్‌ సెక్షన్‌ కార్యాలయాన్ని ఈ వ్రతం నిర్వహించేందుకు వీలుగా మంటపంగా తయారు చేశారు. వ్రతం నిర్వహణకు ఎనిమిది గంటలకు పైగా పడుతుందని అంత సమయం భక్తులు ఉండలేరనే అభిప్రాయం వ్యక్తమైంది. గత నవంబర్‌లో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన కె.రామచంద్రమోహన్‌ దేవస్థానం వైదిక కమిటీ అభిప్రాయం కోరగా, నిర్వహణ కష్టమని చెప్పడంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ వ్రతాన్ని ప్రారంభించి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement