breaking news
zafargad
-
హెచ్ఎంను చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయురాలు
జఫర్‌గఢ్ హైస్కూల్లో ఘటన జఫర్‌గఢ్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుడిపై చెప్పు తో కొట్టగా, మరో ఉపాధ్యాయుడు ఆమెకు తోడై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. పాఠశాలలో ప్రార్థన సమయం ముగిశాక విద్యార్థులు తరగతి గదుల్లోకి, ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్‌లోకి వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి తన గదిలోకి వెళ్లి కూర్చోగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విష్ణుమూర్తి, ఉపాధ్యాయురాలు దేవరాయి శారద హెచ్ఎం గదిలోకి వెళ్లారు. ‘మా గురించి ఊరి లో ఎందుకు చెప్తున్నావంటూ’ శారద హెచ్ఎం తిరుపతిరెడ్డిపై చెప్పుతో దాడికి దిగగా పక్కనే ఉన్న విష్ణుమూర్తి కూడా పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో క్లర్కు, అటెండర్ మాత్రమే ఉన్నారు. క్లర్కు ప్రధానోపాధ్యాయుడిపై జరుగుతున్న దాడిని నివారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో భీతిల్లిన హెచ్ఎం బయటకి రావడంతో, గలాటాను గమనించిన మిగతా ఉపాధ్యాయులు కూడా స్టాఫ్ రూములో నుంచి బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న ఎంఈఓ బత్తిని రాజేందర్ వెంటనే పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా పాఠశాలకు వచ్చారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పరస్పరం ఫిర్యాదు ఉపాధ్యాయుల మధ్య గొడవ స్థానిక పోలీస్స్టేకు చేరుకుంది. తనపై ఉపాధ్యాయురాలు శారద చెప్పుతో దాడికి దిగగా, మరో ఉపాధ్యాయుడు విష్ణుమూర్తి కూడా దాడి చేశాడని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు తిరుపతిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి స్థానిక పోలీస్స్టేలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హెచ్ఎం తమను అవమానపరుస్తున్నాడంటూ తిరుపతిరెడ్డిపై సదరు ఉపాధ్యాయురాలు శారద కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు విద్యారణ్యపురి :ప్రధానోపాధ్యాయుడిపై దాడికి దిగిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. జఫర్‌గఢ్ హైస్కూల్ హెచ్ఎం తిరుపతిరెడ్డిపై అదే పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు డి.శారద, విష్ణుమూర్తి దాడిచేశారని, ఈ విషయాన్ని తిరుపతిరెడ్డి తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. విద్యాబోధన సమయంలో సెల్ఫో వాడకూడదని చెప్పడంతో పాటు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రానప్పుడు గైర్హాజరు వేసినందునే దాడి చేశారని హెచ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఘటనపై విచారణ నిర్వహించామని, ఉపాధ్యాయులు దాడికి పాల్పడింది వాస్తవమేనని తేలిందని చెప్పారు. ఈ ఘటనపై ఎంఈఓ కూడా నివేదిక అందజేశారని, దీంతో వారిద్దరిపై సస్పెన్ష వేటు విధించామని తెలిపారు. ఘటనపై ఈనెల 22న జనగామ డిప్యూటీ డీఈఓతో కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. -
మరమ్మతు మరిచారు
అసంపూర్తిగా ఖమ్మం దర్వాజ పనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు పర్యాటక అభివృద్ధికి నోచుకోని నిజాం కోట కట్టడాలు మరమ్మతుకు రూ.33 లక్షలు జఫర్‌గఢ్ : నిజాం నవాబుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేం పట్టింది లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి ప్రాచుర్యం పొందిన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నా యి. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో నిజాం నవాబులు తమ హయాంలో వివిధ చారిత్రక కట్టడాలు చేపట్టా రు. ఇందులో భాగంగా జాఫర్దౌలత్ నవాబు పన్నుల వసూలుతోపాటు శత్రువుల బారి నుంచి ర„ý ణ పొందేందు కు జఫర్‌గఢ్ ప్రధాన రహదారి వెంబడి ఖమ్మం, హన్మకొం డ, పట్నం(హైదరాబాద్) దర్వా జలను నిర్మించారు. అయి తే ఇందులో హన్మకొండ, పట్నం దర్వాజలు కాలగర్భంలో కలిసిపోగా.. ఖమ్మం దర్వాజ కొంచెం వెలుగులో ఉంది. శిథిలావస్థకు చేరి కళావిహీనంగా మారిన ఖమ్మం దర్వాజ కట్టడాలను పునరుద్ధరించి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పురావాస్తు శాఖ నుంచి రూ. 33 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు దర్వాజ మరమ్మతు పనులకు అధికారులు టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. అయితే ప్రారంభంలో పనులు వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్ మధ్యలో ఆపివేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పత్తాలేని సీసీ రోడ్డు పనులు ఖమ్మం దర్వాజ మరమ్మతు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఎడమవైపున మాత్రమే మరమ్మతు చేపట్టారు. కోట కుడివైపున ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టలేదు. అలాగే కోట లోపలి భాగంలో ఉన్న పెద్ద బండరాళ్లు, మట్టిని తొలగించలేదు. కోట ఆవరణలో సీసీ రోడ్డు నిర్మాణం ఇంతవరకు చేపట్టకపోవడంతో పర్యాటకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పనులు నిలిచిపోయి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హరితహారంలో భాగంగా ఖమ్మం దర్వాజ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న దర్వాజ మరమ్మతు పనుల విషయాన్ని స్థానికులు ఆయనకు వివరించారు. ఖమ్మం దర్వాజ మరమ్మతు పనులతోపాటు మండలంలోని చారిత్రక కట్టడాలకు వెలుగులు తీసుకురావాలని వారు ఎమ్మెల్యే, అధికారులను కోరారు.