breaking news
Yuri Milner
-
ఏలియన్స్, నక్షత్రాలను చేరుకునేందుకు..
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ రష్యా బిలియనీర్ యూరీ మిల్నర్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్లతో కలిసి నక్షత్ర యానం చేసే చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌లను తయారుచేసేందుకు 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని హాకింగ్స్, మిల్నర్‌లు వన్ వరల్డ్ అబ్జర్వేటరీ ఇన్ న్యూయార్క్‌లో ప్రకటించారు. తక్కువ సమయంలో.. 'బ్రేక్ త్రూ స్టార్ షాట్' పేరుతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో కాంతి వేగానికి 20 రెట్లు ఎక్కువగా ప్రయాణించగల నానోక్రాఫ్ట్లను ( ప్రస్తుత స్పేస్‌క్రాఫ్ట్‌లతో పోల్చితే 1,000 రెట్లు వేగంగా ప్రయాణించగలవు) తయారుచేయనున్నారు. నానోక్రాఫ్ట్లు నిర్మించడం పూర్తయిన తర్వాత ఇవి ఆల్ఫా సెంటౌరీ (భూమికి 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం) ని చేరుకోగలదని, ఇందుకు 20 సంవత్సరాల కాలం పడుతుందని మిల్నర్ తెలిపారు. సాధారణ స్పేస్ క్రాఫ్ట్‌లు ఈ దూరాన్ని పూర్తి చేయడానికి 30,000 సంవత్సరాలకు పైచిలుకు సమయం పడుతుంది. చిన్న భాగాలతో.. మొత్తం రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అందుబాటులో ఈ నానోక్రాఫ్ట్ల్లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. 1. కంప్యూటర్ సీపీయూ సైజ్‌లో ఉండే 'స్టార్ చిప్' 2. మెటామెటీరియల్‌తో రూపొందించిన 'లైట్సెయిల్' ఇందులో కేవలం కొన్ని వందల ఆటమ్స్ మందంగా ఉంటాయి. కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉండే స్టార్చిప్లో విశ్వ పరిశోధనకు అవసరమైన కెమెరాలు, నావిగేషన్, సమాచార సాధనాలు ఇమిడి ఉంటాయి. స్టార్చిప్లను ఐ-ఫోన్ ఖరీదులోనే ఒకేసారి తయారు చేసుకోవచ్చని మిల్నర్ వివరించారు. ఏలియన్ల వెతుకులాటకు.. సాధనాలను శక్తిమంతమైన లేజర్ సాయంతో విశ్వ ప్రయాణానికి పంపుతామని, ఇందుకు 100 గిగావాట్ల పవర్‌ను ఉపయోగిస్తామని న్యూస్కాన్ఫరెన్స్ పేనెలిస్ట్ లోఏబ్ తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పదిహేను ఏళ్ల కిందట ఇటువంటి ప్రయోగాలు చేయడంపై పెట్టుబడి పెట్టడం అర్ధం లేదని కానీ, ఇప్పుటి పరిస్థితులు వేరు' అని మిల్నర్ అన్నారు. గత ఏడాది జులై 2015లో మిల్నర్, హాకింగ్స్లు పాలపుంతకు దగ్గరగా ఉన్న 100 గెలాక్సీల్లో ఏలియన్లను వెతకడానికి ప్రారంభించిన ప్రాజెక్టు కూడా బ్రేక్ త్రూలో ఒక భాగం. 'భూమ్యకర్షణ శక్తి మనల్ని కిందే ఉండేలా చేస్తుంది. కానీ, నేను అమెరికాకు ఎగురుకుంటూ వెళ్లగలిగాను.' అని హాకింగ్స్ పేర్కొన్నారు. 'ఆల్ఫా సెంటౌరీని చేరుకోవడం ఒక్కటే మా లక్ష్యం కాదు. ఆ మార్గంలో మేం ఎదుర్కొనే సవాళ్లు కూడా మా లక్ష్యమే. ఇందులో చాలా పెద్ద మొత్తంలో సైన్స్‌ను తెలుసుకోబోతున్నాం' అని జెమీసన్ అన్నారు. 'ఈ రోజు మనిషి మొదటిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన రోజు. ఇదే రోజున మేం మరో పెద్ద కార్యాన్ని తలపెడుతున్నాం' అని హాకింగ్స్ అన్నారు. -
గ్రహాంతర జీవుల కోసం రూ. 650 కోట్లు
లండన్: మానవ చరిత్రలోనే గ్రహాంతర జీవుల కోసం అతిపెద్ద పరిశోధనకు అంకురార్పణ జరిగింది. 100 మిలియన్ యూఎస్ డాలర్ల పైచిలుకు (దాదాపు రూ. 650 కోట్లు) ఖర్చుతో కూడుకున్న ఈ పరిశోధనలను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ సోమవారం ప్రారంభించారు. లండన్ లోని రాయల్ సొసైటీ సైన్స్ అకాడమీ ఇందుకు వేదిక అయింది. గ్రహాంతర జీవుల జాడ కనిపెట్టేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భారీ ప్రయోగం ఇదే. రష్యాకు చెందిన బిలియనీర్, సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రెన్యూర్ యూరీ మిల్నర్ ఈ ప్రయోగానికి కావలసిన నిధులను సమకూర్చుతున్నారు. ప్రయోగం ప్రారంభం సందర్భంగా యంత్రపరికరాలద్వారా మాట్లాడిన స్టీఫెన్ హాకింగ్స్.. సువిశాల విశ్వంలో ఎక్కడో ఒక చోట ప్రాణులు ఉండే ఉంటాయన్నారు. శాస్త్ర అభ్యున్నతి కోసం కోట్లాది రూపాయల ఖర్చుచేసేందుకు ముందుకొచ్చిన యూరీని ప్రశంసించారు. ఇప్పటివరకు చేసినవాటికి భిన్నంగా అతి భారీ టెలిస్కోప్ ద్వారా గ్రహాంతర జీవులను అణ్వేషించనున్నట్లు తెలిపారు.