breaking news
Yedapally
-
ఎమ్మార్వో ఆఫీసులో వ్యక్తి వీరంగం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అధికారులపై దాడికి యత్నించాడు. అడ్డొచ్చిన వీఆర్ఓ పుల్‌సింగ్‌పై దాడి చేశాడు. అంతేకాకుండా కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశాడు. కుర్నాపల్లి శివారులోని సర్వే నంబర్ 127, 128, 129లో ఉన్న భూములను తమ బంధువుల పేరుపై పట్టాలు చేసి పాస్‌బుక్‌లు ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అందుకు అధికారులు కుదరదని చెప్పడంతో.. ఆగ్రహానికి లోనైనా శ్రీనివాస్‌రావు దాడికి తెగబడ్డాడు. పట్టా చేయాలని కోరుతుంటే అధికారులు ఏడాదిన్నరగా తిప్పుకుంటారని శ్రీనివాస్‌రావు ఆరోపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
మిషన్ కాకతీయ పనుల్లో అపశృతి
ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి చెరువులో మిషన్ కాకతీయ పనులు చేపడుతుండగా శనివారం ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందారు. ఈ చెరువు కట్టకు మొరం పనులు చేస్తున్నారు. మొరం సరఫరా చేస్తున్న టిప్పర్ కట్టపై అదుపుతప్పి బోల్తా కొట్టింది.అందులో ఉన్న సబ్ కాంట్రాక్టర్ కర్రోల్ల ప్రసాద్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌కు నిద్ర రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై ఆసిఫ్ తెలిపారు.