breaking news
yatin reddy
-
యతిన్ రెడ్డి, భగత్ వర్మ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: దయానంద్ సీసీ బ్యాట్స్‌మెన్ యతిన్ రెడ్డి (262 బంతుల్లో 170; 20 ఫోర్లు, 6 సిక్సర్లు), భగత్‌వర్మ (234 బంతుల్లో 148; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుత సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఓపికగా ఆడటంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఇన్‌కంట్యాక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో దయానంద్ సీసీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 228/6తో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దయానంద్ సీసీ గురువారం ఆటముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్లకు 558 పరుగులతో నిలిచింది. యతిన్, భగత్‌వర్మ రోజంతా క్రీజులో నిలబడి జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 320 పరుగుల్ని జోడించారు. తొలుత ఇన్‌కంట్యాక్స్ జట్టు 556 పరుగులకు ఆలౌటైంది. 2 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన దయానంద్ సీసీ జట్టుకు 3 పాయింట్లు లభించగా, ఇన్‌కంట్యాక్స్ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈ మ్యాచ్‌లో దయానంద్ సీసీ తరఫున అన్షుల్ (100), వై. చైతన్య కృష్ణ (104), యతిన్రెడ్డి, భగత్‌వర్మ సెంచరీలు చేశారు. దీపాన్‡్ష బుచర్, పి. రోహిత్ రెడ్డి, సలీమ్ షేక్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు గ్రూప్ ‘ఎ’: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 364, రెండో ఇన్నింగ్స్: 65/1 (వంశీకృష్ణ 32 నాటౌట్); జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 165 (కమ్రుద్దీన్ 3/17, బి. సుధాకర్ 3/12). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232, రెండో ఇన్నింగ్స్: 137 (టి. సంతోష్ 48; కనిష్క్ నాయుడు 6/42), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320, రెండో ఇన్నింగ్స్: 51/1 (9.1 ఓవర్లలో). ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 342, రెండో ఇన్నింగ్స్: 313/6 డిక్లేర్డ్ (డానీ డెరెక్ ప్రిన్స్ 84, ఆకాశ్ భండారి 115), ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 244. గ్రూప్ ‘బి’ ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 436; రెండో ఇన్నింగ్స్: 118/6 డిక్లేర్డ్ (రాహుల్ 49 నాటౌట్; వి. సాత్విక్ రెడ్డి 4/50), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 116, రెండో ఇన్నింగ్స్: 226 ( పి. నీలేశ్ 65; దివేశ్ పథానియా 4/55). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 610/6; ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 290, రెండో ఇన్నింగ్స్: 159/3 (వైష్ణవ్ రెడ్డి 66, అసదుద్దీన్ 71 నాటౌట్). ∙ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 393, రెండో ఇన్నింగ్స్: 163/1 (ఓవైస్ 61 నాటౌట్, జునైద్ అలీ 95), కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 263/9 డిక్లేర్డ్ (వై. అనిరుధ్ రెడ్డి 108, సంకీర్త్ 61; అజహరుద్దీన్ 4/17, మెహదీ హసన్ 4/48). జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 429; ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 165 (రతన్ తేజ 4/44), రెండో ఇన్నింగ్స్: 237 (శ్రేయస్ 136; ఎం. రాధాకృష్ణ 4/43, సంకేత్ 3/40). -
హైదరాబాద్ కెప్టెన్‌గా యతిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో పాల్గొనే అండర్-23 హైదరాబాద్ క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 వరకు జరుగుతుంది. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు యతిన్ రెడ్డి కెప్టెన్‌గా... తనయ్ త్యాగరాజన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అర్జున్ యాదవ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. జట్టు: బి. యతిన్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, వై. చైతన్య కృష్ణ, పి.ఎస్. చైతన్యరెడ్డి, టి. రవితేజ, తనయ్ త్యాగరాజన్, ప్రణీత్ రెడ్డి, టి.పి. అనిరుధ్, సయ్యద్ అహ్మద్, మోహిత్ సోని, జె. మల్లికార్జున్, బి. చంద్రశేఖర్, పి. రోహిత్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, రాహుల్.