breaking news
wyra reservoir
-
ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక రంగంపై నిర్లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్
వైరా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యా టక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఖమ్మం జిల్లాకు వచ్చి నప్పటికి.. ఇప్పటికీ అభివృద్ధిలో ఎంతో తేడా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా వైరాలో ఇండోర్ స్టేడియం ప్రారంభించాక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతుండగా, ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. -
చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
వైరా (ఖమ్మం) : చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో శనివారం చోటుచేసుకుంది. వైరా రిజర్వాయర్‌లో శుక్రవారం సాయంత్రం కొందరు మత్స్యకారులు చేపలు పడుతుండగా.. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురు గాలులతో కూడిన గాలి వాన వచ్చింది. ఈ గాలి ధాటికి తెప్పలపై చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు నీట మునిగి గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో కొనిజర్ల మండలానికి చెందిన షేక్ అక్బర్, సైదులుతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ముఖ్యమంత్రిని కలుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వైరా రిజర్వాయర్‌కు సాగర్ జలాల కోసం ముఖ్యమంత్రిని కలుస్తాం వైరా: వైరా రిజర్వాయర్‌ను సాగర్ జలాలతో నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో కలవనున్నట్టు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైరా రిజర్వాయర్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైరా రిజర్వాయర్ కింద అధికారికంగా 17,390; అనధికారికంగా 23,000 ఎకరాలు సాగులో ఉందని అన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేయలేకపోయారని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆయకట్టు ఈ ఏడాది పెరిగిందన్నారు. వైరా రిజర్వాయర్ సమీపం నుంచి నాగార్జున సాగర్ జలాలు వెళ్తున్నప్పటికీ రిజర్వాయర్‌లోకి మాత్రం ఎన్నెస్పీ నీరు వచ్చే అవకాశం లేదని అన్నారు. ఈ రిజర్వాయర్ నుంచి సుజల స్రవంతి మంచినీటి పథకం ద్వారా మధిర నియోజకవర్గంలోకి ప్రతి రోజు లక్ష లీటర్ల నీరు అందుతోందని అన్నారు. ఈ రిజర్వాయర్‌లోకి ప్రతి ఏటా ఆరు టీఎంసీల నీటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోగల వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. ‘‘ఈ రిజర్వాయర్‌ను సాగర్ జలాలతో నింపేంత వరకు ప్రభుత్వానికి విన్నవిస్తాం. లేదంటే, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులపక్షాన పోరాడతాం’’ అని ప్రకటించారు. రిజర్వాయర్ సందర్శన కార్యక్రమంలో పార్టీ వైరా నియోజకవర్గ కన్వీనర్ బొర్రా రాజశేఖర్, మండల కన్వీనర్ సూతకాని జైపాల్, జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యుడు ముళ్ళపాటి సీతారాములు, గరికపాడు సర్పంచ్ శీలం కరుణాకర్‌రెడ్డి, సిరిపురం సర్పంచ్ తాటి వెంకటేశ్వర్లు, నాయకులు తడికమళ్ళ నాగేశ్వరావు, దొడ్డపనేని రామారావు, రాయల పుల్లయ్య, తేలప్రోలు నర్సింహారావు, పాముల వెంకటేశ్వర్లు, నల్లమల్ల శివకుమార్, తాతా రంగారావు, షేక్ ఖాసీం, పాపారావు, ధార్న శేఖర్ తదితరులు ఉన్నారు.