breaking news
WTA Tour
-
డబ్ల్యూటీఏ టూర్లో సహజ అరంగేట్రం
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 స్థాయి టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి అరంగేట్రం చేసింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ డబ్ల్యూటీఏ–250 టోర్నీ క్వాలిఫయింగ్‌లో సహజ బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 305వ ర్యాంక్‌లో ఉన్న సహజ తొలి రౌండ్లో 2–6, 1–6తో ప్రపంచ 91వ ర్యాంకర్ జెస్సికా (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. -
నంబర్ వన్ స్థానంపై సానియా మీర్జా గురి
హైదరాబాద్: వచ్చే సీజన్ లో టెన్నిస్ పోటీలలో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానంపై సానియా మీర్జా కన్నేసింది. డబ్ల్యూటీఏ టూర్ టైటిల్ చేజిక్కించుకుని ఈ సంవత్సరాన్ని సానియా దిగ్విజయంగా ముగించుకున్న సంగతి తెలిసిందే. విజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభిమానులు తనను ఎక్కువగా ఆశించారు. అంతేకాకుండా తాను విజయం సాధించాలని కోరుకున్నారు కూడా అని సానియా తెలిపారు. నా లక్ష్యానికి చేరువయ్యాను. ప్రపంచ నంబర్ వన్ స్థానం కోసం ప్రయత్నిస్తాను అని సానియా తెలిపారు. ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ ను, ప్రపంచ చాంఫియన్ షిప్ ను గెలుచుకోవడం తన లక్ష్యాల్లో భాగమని అని ఆమె అన్నారు. సింగపూర్ లో జింబాబ్వే క్రీడాకారిణీ కార్లా బ్లాక్ తో కలిసి ఇటీవల డబ్ల్యూటీఏ టూర్ టైటిల్, యూఎస్ ఓపెన్, ఆసియా క్రీడల్లో మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2014 సంవత్సరం ఎన్నో మధురానుభూతుల్ని పంచిందని సానియా మీర్జా తెలిపారు.