breaking news
worth Rs. 1 Lakh
-
ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు
ఓ చిన్న రేకుల షెడ్‌కి అది కూడా రెండు ఎల్ఈడీ బల్బులకు ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చోసుకుంది. కర్ణాకలోని దారిద్య రేఖకు దిగువునన ఉన్న ప్రజలకు విద్యుత్్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం భాగ్యజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిచింది. ఆ పథకం కిందే కరెంట్ పొందింది 90 ఏళ్ల వృద్ధురాలు. ఐతే ఆమెకు ఉన్న చిన్న రేకుల షెడ్డులాంటి ఇంటిలో రెండు ఎల్ఈడీ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. వాటికి నెలకు మహా అయితే రూ. 70 లేదా రూ. 80ల కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఆమెకు మే నెలలో మాములుగా రాలేదు కరెంట్ బిల్లు. దాన్ని చూసి ఆ వద్ధురాలికి కళ్లు తిరిగినంత పనయ్యింది. వందో వెయ్యో కాదు ఏకంగా రూ. 1,03,315 బిల్లు వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ విషయం తెలుసుక్నున విద్యుత్ శాఖ అధికారులు ఆ వృద్ధురాలి ఇంటికి చేరకుని విచారించారు. మీటర్లో లోపం ఉందని, రీడింగ్ తీసిన వ్యక్తి కూడా తప్పుగా చూసినట్లు తేలింది. అంతేగాదు అధికారులు ఆమెను ఆ బిల్లును చెల్లించవద్దని, తాము దీన్ని సరిచేస్తామని ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
గుట్కా, ఖైనీ పట్టివేత
సాలూరు (విజయనగరం జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన మోహన్‌రావు ఇంట్లో అక్రమంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతని ఇంట్లో సోదాలు జరిపి లక్ష రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.