breaking news
Worlds Most Expensive
-
ఈ క్రెడిట్ కార్డు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదు
ఈరోజుల్లో దాదాపు ప్రతిఒక్కరి దగ్గర ముఖ్యంగా ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొందరి దగ్గరైతే రెండు, మూడుకు మించి కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. క్రెడిట్ సదుపాయంతోపాటు ఆకర్షణీయమైన ప్రయోజనాల కోసం చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు గురించి తెలుసా? దీని కోసం ఎంత ఖర్చవుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..నేటి ప్రపంచంలో క్రెడిట్ కార్డులు రోజువారీ జీవితంలో భాగంగా మారాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటారు. అసరమైనప్పుడు ఖర్చు చేసేందుకు మాత్రమే కాకుండా సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లుక,ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా క్రెడిట్ కార్డులు. ఈ ప్రయోజనాలు పరోక్షంగా డబ్బు ఆదా చేయడానికి సహాయపడతాయి. అయితే క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించకపోతే మాత్రం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.భారత్‌లో 200 మంది దగ్గరే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు ఒకటి ఉంది. దీని పేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్. సింపుల్‌గా అమెక్స్ బ్లాక్ కార్డ్ అని పిలుస్తారు. దీనిని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంక్ జారీ చేస్తుంది.ఈ కార్డు ఖరీదైనది మాత్రమే కాదు. చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. సాధారణ కార్డుల మాదిరిగా దీనికి దరఖాస్తు చేయలేము. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉంది. భారత్ లో అయితే కేవలం 200 మంది దగ్గర మాత్రమే ఈ కార్డు ఉందని చెబుతున్నారు. ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది.రూ.10 కోట్లు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలిఅమెక్స్ బ్లాక్ కార్డు ఆహ్వానం ద్వారా మాత్రమే ఇస్తారు. అది కూడా చాలా అధిక ఆదాయం, ఖర్చు అలవాట్లు ఉన్నవారికి. అర్హత సాధించాలంటే రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసే సామర్థ్యం ఉండాలి. దీన్నిబట్టి ఈ కార్డు కేవలం ధనవంతుల కోసమేనని స్పష్టమవుతోంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డ్‌తో ప్రపంచ స్థాయి హోటళ్లలో బస, ప్రైవేట్ జెట్ సేవలు, ఎయిర్‌పోర్ట్‌లలో వీఐపీ ట్రీట్మెంట్ వంటి అల్ట్రా లగ్జరీ సదుపాయాలు లభిస్తాయి.రూ.లక్షల్లో కార్డు ఫీజుఅమెక్స్ బ్లాక్ కార్డు ఖరీదు మామూలుగా ఉండదు. భారత్‌లో ఈ కార్డ్ ఇనీషియేషన్ ఫీజు రూ.7 లక్షలు, జాయినింగ్ ఫీజు రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి జీఎస్టీ అదనం. అంటే ఈ క్రెడిట్ కార్డుకు మొదటి ఏడాది చెల్లించాల్సి మొత్తం రూ.11.5 లక్షలు దాటుతుంది. ఇక వార్షిక రుసుము రూ.2.75 లక్షలు జీఎస్టీతో కలుపుకొంటే రూ.3,24,500 అవుతుంది. -
ధర ‘వింటే’ మతిపోతుంది! అత్యంత ఖరీదైన ఇయర్‌ఫోన్స్ ఇవే..
ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లదే హవా. కళ్లు చెదిరే ధరతో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితోపాటు స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే స్థాయిలో లాంచ్ అవుతున్నాయి. అయితే ఈ ఇయర్‌ఫోన్స్ ధర తెలిస్తే మాత్రం నిజంగానే మతిపోతుంది! లూయిస్ విట్టన్ అనే కంపెనీకి చెందిన ఇయర్‌ఫోన్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి. ఈ ఏడాది మార్చిలో హారిజన్ లైటప్ ఇయర్ఫోన్లను విడుదల చేసి అభిమానులను విస్మయానికి గురి చేసింది. వీటి ధర అక్షరాలా 1,660 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.38 లక్షలు. అత్యాధునిక ఫీచర్లతోపాటు ఈ సొగసైన ఇయర్‌బడ్‌ల ధర సోషల్ మీడియాలో వైరల్ మారి వీటికి క్రేజ్‌ను పెంచాయి. ప్రత్యేకతలెన్నో.. మతిపోగొట్టే ధరతోపాటు క్రేజీ ఫీచర్లు వీటి సొంతం. బ్రాండ్ ఐకానిక్ మోనోగ్రామ్ ప్యాట్రన్‌తో తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ ఇయర్‌బడ్‌లను రూపొందించారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎలిమినేటింగ్ మైక్రోఫోన్, బ్లూటూత్ మల్టీపాయింట్ వంటివి వీటి ప్రత్యేకతలు. ఐదు రంగులలో లభ్యమయ్యే ఈ ఇయర్‌బడ్స్‌కు 28 గంటల బ్యాటరీ లైఫ్, గ్రేడియంట్ రంగులతో ప్రకాశించే సొగసైన స్టెయిన్లెస్ స్టీల్ ఛార్జింగ్ కేస్ స్పెషల్ ఫీచర్స్. -
అరుదైన పెన్ను రూ.66.6 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలం ఇదే..
World's most expensive pen: ప్రపంచ వ్యాప్తంగా అరుదైన వస్తువులను వేలం వేస్తుంటారు. ఆయా వస్తువులు కోట్లాది రూపాయలు పలకడం గురించి వింటుంటాం. ఇలాగే ఓ అరుదైన పెన్నును వేలం వేయగా 8 మిలియన్ డాలర్లు (రూ.66.6 కోట్లు) పలికింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. టిబాల్డి కంపెనీ తయారు చేసిన ఈ పెన్ను పేరు ‘ఫుల్గోర్ నోక్టర్నస్’. ఇది లాటిన్ పేరు. దీనికి అర్థం నైట్ గ్లో. నల్ల వజ్రాలు పొదిగిన ఈ అసాధారణ ఫౌంటెన్ పెన్‌కి ఇది సముచితమైన పేరు. 123 కెంపులు, 945 నల్ల వజ్రాలు, బంగారం అసాధారణమైన ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ నిర్మాణం, డిజైన్ ఫై రేషియోలో ఉంటాయి. దీన్ని దైవిక నిష్పత్తిగా పేర్కొంటారు. ఫుల్గోర్ నోక్టర్నస్ బాడీ, క్యాప్‌పై నల్ల వజ్రాలు విలాసంగా పొదిగి ఉంటాయి. అలాగే అద్భుతమైన బ్లడ్ రెడ్ కెంపులు పెన్ను క్యాప్‌ని అలంకరించి ఉంటాయి. మొత్తంగా ఇందులో 945 నల్ల వజ్రాలు, 123 కెంపులు పొదిగారు. 18-క్యారెట్ల బంగారంతో దాని నిబ్‌ను తయారు చేశారు. అత్యంత ఖరీదైన పెన్ను ఈ పెన్నును ప్రత్యేక ఉంచేది దాని దైవిక ఫై నిష్పత్తి. ఈ పెన్నును క్యాప్తొ మూసేసినప్పుడు అవి 1.618 ఫై నిష్పత్తిలో ఉంటాయి. ఇలాంటి పెన్ను మరొకటి లేదు. 2020లో ఫుల్గోర్ నోక్టర్నస్ పెన్ను షాంఘైలో వేలం వేయగా అది 8 మిలియన్ డాలర్లు పలికింది. ఇంతవరకూ ఏ పెన్ను కూడా ఈ స్థాయిలో ధర పలకలేదు. దీంతో ఇదే ప్రపంచ అత్యంత ఖరీదైన పెన్నుగా నిలిచింది. ఇదీ చదవండి: Dr Ranjan Pai: నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు -
వామ్మో రూ.4 కోట్లు! ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టాక్ ఇదే..
దేశీయ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.లక్ష వద్ద ట్రేడ్ అయిందని తెలిసి ముక్కున వేలేసుకున్నాం. ఇదే భారత్‌లో ఖరీదైన షేర్ అని భావిస్తుండగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ గురించి తెలిసింది. వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే క్లాస్ A షేర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్కొక్కటి 5,00,000 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి. అంటే భారతీయ కరెన్సీలో రూ.4 కోట్లకుపైనే. జూన్ 13న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ షేరు 513,655.58 డాలర్ల వద్ద ముగిసింది. ఐదేళ్లుగా షేరును కలిగి ఉన్న ఇన్వెస్టర్లు దాని విలువలో 80 శాతం మేర పెరుగుదలను చూశారు. అధిక ధర కారణంగా కొంత మంది ఇన్వెస్టర్లు స్టాక్ కొనుగోలు చేసేందుకు ముందుకురానప్పటికీ కేవలం త్వరగా లాభాలు ఆర్జించడం కంటే ఓపికగా, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెట్టే ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని బెర్క్‌షైర్ హతావే సీఈవో వారెన్ బఫ్ఫెట్ చెబుతున్నారు. అలాంటివారే తనకు కావాల్సిందని ఆయన పేర్కొన్నారు. అస్థిరత ఎక్కువగా ఉండే తక్కువ ధరల స్టాక్‌లలో ప్రోత్సాహకం ఉండదని బఫెట్ తెలిపారు. ఇన్వెస్టర్లకు మరింత అంతర్గత విలువను సృష్టించే స్టాక్‌కు ఆయన ప్రాధాన్యతనిస్తారు. బఫెట్ 1996లో 517,500 క్లాస్ B షేర్లను పరిచయం చేశారు. ఆ స్టాక్ ధర సుమారు 30,000 డాలర్లు. క్లాస్ A బెర్క్‌షైర్ షేర్ల మాదిరిగా కాకుండా క్లాస్ B షేర్ల విషయంలో స్టాక్ స్ప్లిట్ జరగవచ్చు. 2010 జనవరి 21న ఒక స్టాక్ స్ప్లిట్ 50:1 నిష్పత్తిలో జరిగింది. బెర్క్‌షైర్ హతావే మార్కెట్ క్యాపిటలైజేషన్ 737.34 బిలియన్ డాలర్లు. క్లాస్ A షేర్ల ద్వారా 15 శాతం, క్లాస్ B షేర్ల ద్వారా 0.01 శాతం కంపెనీని బఫెట్ కలిగి ఉన్నారు. MRF stock today hit the ₹1,00,000 mark. It became the 1st stock in the Indian Market to ever touch the 6 figure mark. The most expensive stock in the world is Berkshire Hathaway at 400,000$ (around 3.2Crore per stock). Long way to go, but hope MRF crosses that mark one day. — Akshat Shrivastava (@Akshat_World) June 13, 2023 -
దిండు 45,00,000 రూపాయలు
అంత డబ్బు పెడితే... ఓ హైఎండ్ కార్ కొనేయొచ్చు. ఓ మోస్తరు ఇల్లు కొనుక్కోవచ్చు. అలాంటిది ఓ మెత్తకు అంత ధర ఉంటుందా? అని నమ్మలేకపోతున్నారు కదూ! కానీ నిజం. దాని విలువ రూ. 45 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు. ఎంత థెరపిస్ట్ డిజైన్ చేసినా అంత రేటెందుకు అంటే? దాని ధర వెనుక 15 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. అంతేకాదు అందులో ఉన్న దూదిని రోబోటిక్ మిల్లింగ్ మెషీన్‌తో తయారు చేశారు. నిద్రరాకుండా బాధపడేవారు, వివిధ రకాల మెడ నొప్పులతో ఇబ్బందులు పడేవాళ్లను సైతం ఈజీగా నిద్రపుచ్చేస్తుందీ మెత్త. అంత సౌకర్యంగా ఉంటుంది మరి. అలాగే ఈ దిండును బంగారం, నీలమణులను పొదిగి మరీ తయారు చేశారు. మెత్త కవర్ జిప్ డిజైన్‌కు నాలుగు వజ్రాలను ఉపయోగించారు. ఇక సాధారణ మాల్స్‌లో ఇచ్చినట్టుగా దీన్ని కవర్లో పెట్టి ఇవ్వరు. దానికోసమే ప్రత్యేకంగా రూపొందించిన బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్‌చేసి మరీ ఇస్తారట. -
ప్రపంచంలో ఖరీదైన సాండ్ విచ్ ఎంతో తెలుసా!
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ ధర ఎంతో ఉంటుందో మీకు తెలుసా..! 214 డాలర్లు. అంటే దాదాపు అక్షరాల పద్నాలుగు వేల రూపాయల వరకు అన్నమాట. అమ్మో అని ఆశ్చర్యపోతున్నారా.. మరి అంతేనండి. న్యూయార్క్ లోని సెరిండిపిటి అనే ఓ కాస్ట్లీ రెస్టారెంట్ దీనిని తయారు చేసింది. గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటుకూడా దక్కించుకుంది. అంతేకాదు ఆ సాండ్ విచ్ కావాలంటే అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సిందే. రెండు రోజులు ముందే ఆర్డర్ ఇస్తే వారు తయారు చేసి ఇస్తారు. లేదంటే కష్టమే. బంగారు వర్ణంతో తయారు చేసే ఈ సాండ్ విచ్ ఒక్కసారి తింటే ఇంత ధర పెట్టామా అనే ఆలోచన కూడా మనసులో రాదంట. ఈ సాండ్ విచ్ ద్వారా తన రెస్టారెంటు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాధించపట్ల దాని యజమాని తెగ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచ సాండ్ విచ్ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సాండ్ విచ్ తయారు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.