breaking news
world trade
-
825 బిలియన్ డాలర్ల ఎగుమతులు
బెర్న్: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్ 2025–26లో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ పోరు, రెడ్సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్ 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హన్ తెలిపారు. ఎఫ్ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్ఐఈవో అంచనా. ఎఫ్‌టీఏలతో సానుకూలత యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్‌టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పాలనలో కుదిరిన ఎఫ్‌టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్ మార్కెట్ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. -
తప్పుడు విధానాలతో రూపాయి పతనం
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలతో ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువ పతనం అవుతోందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయ పడ్డారు. ఆదివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఎంప్లాయీస్, టీచర్స్, ప్రొఫెషనల్స్ స్డడీ ఫోరం ఆధ్వర్యంలో రూపాయి పతనం- కారణాలు - పరిష్కారం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ..1991 నుంచి కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో విదేశీ మారకద్రవ్యం, కరెంటు అకౌంట్ లోటు పెరిగిపోయి ధరలు పెరిగిపోతున్నాయన్నారు. దీంతో ఆర్థిక శాస్త్రం ఓ అర్థం కాని శాస్త్రంగా మారిందని పేర్కొన్నారు. దేశంలోకి చమురు దిగుమతి 76శాతం ఉందని, డాలర్లలో బిల్లు చెల్లిస్తున్నందువల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయని వెల్లడించారు. పలు అంశాల్లో సామాన్యులపై భారం పెరిగినా సంపన్నులపై తగ్గడం హాస్యాస్పదమన్నారు. విలాసవంతమైన వస్తువులు, ఉపకరణాలను దిగుమతి చేసుకోవడం ఆపాలని సూచించారు. ప్రొడక్షన్ షేరింగ్ అగ్రిమెంట్‌తో చమురు కొనుగోళ్ల భారం పెరిగి ప్రజలపై పడుతోందన్నారు. ఈ సదస్సులో ఫోరం కన్వీనర్ బిఎల్ఎన్ ప్రసాద్ శర్మ, నాయకులు సురేష్, బడేసాహెబ్, నరసింహ, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.