breaking news
wonderla holidays limited
-
వండర్లాలో రెండు రైడ్స్‌ను ఆవిష్కరించిన స్టార్ నాగ చైతన్య
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్లా హాలిడేస్ లిమిటెడ్, వండర్లా హైదరాబాద్‌లో రెండు హైపర్‌వర్స్, జి-ఫాల్ అనే అత్యాధునిక రైడ్స్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఆవిష్కరించారు. కంపెనీ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి , సీఓఓ ధీరన్ చౌదరి, పార్క్ హెడ్, మధు సూధన్ గుత్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జి-ఫాల్ రైడ్, 40 మీటర్ల ఎత్తులో, గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్లతో, అడ్రినలిన్ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.హైపర్‌వర్స్, అత్యాధునిక మెటావర్స్ 3డి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ వసతి కల్పిస్తుంది. 8కె హై-రిజల్యూషన్ డిస్ప్లే, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ లైట్ 270డిగ్రీ షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది.ఈ సందర్భంగా వండర్లా హాలిడేస్ ఎండీ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, ‘‘వండర్లా వద్ద, వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో కొత్త రైడ్, హైపర్‌వర్స్, లీనమయ్యే సాంకేతికత సాహసోపేతమైన ముందడుగు అన్నారు.జి-ఫాల్ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశిస్తున్నామన్నారు.ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్లా హైదరాబాద్‌లో ప్రారంభించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు నాగ చైతన్య. గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్లను వండర్లా ఎలా తీసుకువస్తోందో చూడటం తనకు థ్రిల్లింగ్‌గా ఉందనీ, విఆర్ - ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా టాప్‌లో ఉందని కొనియాడారు. ఇది సందర్శకులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నా అన్నారు.వండర్లా సందర్శకులను ఆన్లైన్ పోర్టల్ ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. నేరుగా పార్క్ కౌంటర్ల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.వండర్లా హాలిడేస్ లిమిటెడ్ గురించి భారతదేశపు అతిపెద్ద, ప్రీమియర్ అమ్యూజ్మెంట్ పార్క్ ఆపరేటర్, వండర్లా హాలిడేస్ లిమిటెడ్. ఇది అగ్రశ్రేణి వినోదం, వినూత్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్లలో నాలుగు ప్రపంచ స్థాయి అమ్యూజ్మెంట్ పార్క్ లను నిర్వహిస్తోంది. ఆహ్లాదం, కుటుంబ వినోదం కోసం బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది.మరింత సమాచారం కోసంవండర్లా హాలిడేస్ లిమిటెడ్+91 8136852848 -
క్యూ3లో వండర్లా లాభం పైపైకి
బెంగళూరు: వినోదరంగంలోని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి రూ.78.63 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81.34 శాతం ఎక్కువని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నులు మినహాయించి వచ్చిన లాభం రూ.6.54 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.14.51 కోట్లకు చేరి 122 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బెంగళూరు, హైదరాబాద్ వండర్లా పార్కుల్లో సందర్శకుల సంఖ్య వరుసగా 23 శాతం, 12 శాతం పెరిగిందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జోసెఫ్ వెల్లడించారు. -
21న వండర్లా పబ్లిక్ ఇష్యూ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోచి, బెంగళూరులలో అమ్యూజ్మెంట్ పార్కులను నిర్వహిస్తున్న వండర్లా హాలిడేస్ లిమిడెట్ హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వద్ద రూ.250 కోట్లతో కొత్త ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ సంస్థ ఎండీ అరుణ్ చిట్టిలప్పిల్లి వెల్లడించారు. ఈ నెల 21న రూ.10 ముఖ విలువ కలిగిన 1.45 కోట్ల ఈక్విటీ వాటాలను రూ.115-125 ప్రైస్ బ్యాండ్‌తో పబ్లిక్ ఇష్యూ జారీ చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయనిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 25 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్కు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయయని, రెండేళ్లలో దీనిని పూర్తి చేస్తామని వివరించారు. ఈ పార్కులో 45 రైడ్స్‌తో పాటు వాటర్, థీమ్ పార్కులు ఉంటాయన్నారు. ఇష్యూ ఈ నెల 23న ముగుస్తుందన్నారు. దీని ద్వారా సేకరించిన మొత్తాన్ని హైదరాబాద్ ప్రాజెక్టుపైనే ఖర్చు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రూ.36 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన మొత్తాన్ని రుణ దాతల ద్వారా సేకరిస్తామని ఆయన వివరించారు.