breaking news
woman beats husband
-
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
మహబూబ్‌నగర్: పక్కదారి పట్టిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని మరీ ఓ మహిళ అతనికి దేహశుద్ధి చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా రాయిగడ్డ వీధికి చెందిన తిరుపతయ్య, లక్ష్మీకి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అయితే మూడేళ్లుగా తిరుపతయ్య తీరు మారింది. దీంతో నిఘా పెట్టిన లక్ష్మీ తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని గుర్తించింది. మంచిమాటలతో అతనిలో మార్పుతేవాలని ప్రయత్నించింది. అయినా తిరుపతయ్య చెవికెక్కించుకోలేదు. దీంతో అతనికి ఎలాగైనా బుద్ధిచెప్పాలని భావించిన లక్ష్మీ.. తిరుపతయ్య వేరే మహిళతో గడుపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. బంధువులతో కలిసి వెళ్లి ఆ ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. -
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..