breaking news
Wipe
-
మాది ప్రత్యేక అనుబంధం; ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాదు అప్పుడప్పుడు వింత చేష్టలు చేసి కూడా వార్తల్లో నిలుస్తారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ఒక వింత పనికి సంబంధించిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోల్లో ట్రంప్... ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కోటు కాలర్ మీద ఉన్న డాండ్రఫ్ను తొలగిస్తున్నారు. ఈ పని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఆసక్తికర సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఇంతకు విషయం ఏంటంటే ట్రంప్ అధికారం చేపట్టిన 15 నెలల తరువాత ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ అమెరికాను సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు, ఫ్రెంచ్ అధ్యక్షుడి కోటు కాలర్ మీద ఉన్న డాండ్రఫ్ను తొలగిస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ... ‘మా మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది, మేము అతన్ని పర్ఫెక్ట్గా ఉంచాలి...అతను పర్ఫెక్ట్గా ఉన్నాడ’ని తెలిపారు. -
'డ్రగ్ కాక్టెయిల్' తో స్కిన్ క్యాన్సర్ నివారణ
లండన్ః స్కిన్ క్యాన్సర్ నివారణకు డ్రగ్ కాక్టెయిల్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిసోధనలు చెప్తున్నాయి. రెండు వ్యాధి నిరోధక మందులు కలపడంతో రోగుల జీవిత కాలాన్నిమరింత పొడిగించవచ్చని, అన్ని రకాల మెలనోమాను నాశనం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మ క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించినా నివారించవచ్చని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. స్మార్ట్ ఔషధాల కలయిక చర్మ క్యాన్సర్ ను నివారిస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. రెండు ఔషధాలను కాక్టెయిల్ చేసి రోగుల్లోని అన్ని రకాల మెలనోమాను నివారించ గలిగినట్లు అధ్యయనకారుల పరిశోధనా ఫల్లితాలు వెల్లడించాయి. ఒకవేళ క్యాన్సర్ శరీరంలోని ఇదర భాగాలకు వ్యాపించినప్పటికీ ఈ కొత్త పద్ధతితో తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. 2013 లో బ్రిటన్ లోని 14,500 మందిలో మెలనోమా వ్యాపించగా అందులో 2,100 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. తాజాగా కనుగొన్న ఈ కాక్టెయిల్ పద్ధతిలో వైద్యులు సింగిల్ గానూ రెండు మందులను కలపి మెలనోమా ఉన్న 142 మంది రోగులకు అందించారు. కొత్త ప్రయోగంతో 69 శాతం రోగుల్లో మంచి ఫలితాలు కనిపించాయని, ఒకటే మందును ఇచ్చిన 53 శాతంమంది రోగులకన్నా... రెండు మందులను కలిపి ఇచ్చిన రోగులు మరో రెండు సంవత్సరాలు తర్వాత కూడ బతికే ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు కాక్టెయిల్ మందు తీసుకున్న 22 శాతంమందిలో క్యాన్సర్ పుండును పూర్తిగా నిర్మూలించినట్లు గుర్తించారు. దీంతో ఇపిలిముమాబ్ (కాక్టెయిల్ డ్రగ్) మంచి ఫలితాలను ఇస్తుందని తెలుసుకున్నారు. రెండు ఔషధాల కలయిక క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తుందని, రోగంతో సమర్థవంతంగా పోరాడుతుందని లారిన్ మర్శేన్ ఆస్పత్రి సలహాదారుడు డాక్టర్ జేమ్స్ లార్కిన్ తెలిపారు. ఈ కొత్త పరిశోధనలు రోగులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత ఆశను కల్పించాయని తెలిపారు. పరిశోధనా ఫలితాలను ఆమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్స్ వార్షిక సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ రెండు ఔషధాల కలయికను బ్రిటన్ లో ప్రయోగించేందుకు ఇంకా ఆమోదించలేదు. ఈ కొత్త పద్ధతిలో వైద్యం కొంత ఖరీదు అవుతుందని, అయితే మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ పద్ధతిని అనుమతిస్తే... ఖరీదు విషయం తర్వాత ఆలోచించవచ్చని బ్రిటన్ క్యాన్సర్ రీసెర్స్ లోని డాక్టర్ ఆనె మెక్ కార్తీ అంటున్నారు. మరోవైపు తాను ఇంతకు ముందు ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నానని, ఇప్పుడు మరో రెండేళ్ళు బతికే ఉన్నానంటే ఈ కొత్త పరిశోధనల ఫలితమేనని కాక్టెయిల్ డ్రగ్ ను వినియోగించిన రోగి కూడ చెప్తున్నారు.