breaking news
Windows 8.1
-
భలే ఆప్స్
విండోస్ 8.1పై కొత్త అప్లికేషన్లు! విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న వారికి ఈ దీపావళి సందర్భంగా కొత్త అప్లికేషన్లను తీసుకొస్తున్నామని ప్రకటించింది మైక్రోసాఫ్ట్. పీసీ వినియోగంలో ఈ అప్లికేషన్లు సరికొత్త అనుభవాన్ని ఇస్తాయిని మైక్రోసాఫ్ట్వాళ్లు అంటున్నారు. ఇ-వెంట్: ఇది ఒక క్విక్ ఈవెంట్ మేనేజ్ అప్లికేషన్. సంబరాల సమయంలో సోషల్ మీడియా ద్వారా అందరికీ కనెక్ట్ కావడానికి ఈ అప్లికేషన్ ఉపయుక్తంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. నాన్‌స్టాప్ మ్యూజిక్: సొంతంగా మ్యూజిక్ మిక్స్ చేసి.. ఇష్టమైనట్టుగా కొత్త ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. వీటితో పాటు వందల, వేల కొద్దీ రెసిపీల గుట్టును వివరించి కొత్త రుచులు చూపించే ఎమ్ఎస్ఎన్ ఫుడ్ అండ్డ్రింక్, లూమియా సెల్ఫీ, ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటో ఫూనియా, ఇన్‌స్టాగ్రామ్‌లను విండోస్ 8.1పై అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మాత్రమే గాక దీపావళి సంబరాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఐదివాళీ, రంగోళీ క్రియేటర్ వంటి అప్లికేషన్లను కూడా విండోస్8.1 వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ల్యాప్స్ ఇట్తో అద్భుతమైన వీడియోలు టైమ్‌ల్యాప్స్ వీడియోగ్రఫీ గురించి మీరు వినే ఉంటారు. మెరుపువేగంతో మారిపోయే ఫ్రేమ్స్‌తో సృష్టించే ఈ రకమైన వీడియోలను అప్పుడప్పుడు సినిమాల్లోనూ చూసే ఉంటాం. ఇలాంటి అద్భుతాలను మీ స్మార్ట్‌ఫోన్‌తోనూ సృష్టించుకోవచ్చు. కావాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే ‘ల్యాప్స్ ఇట్’ అప్లికేషన్ మాత్రమే. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాలోని సెన్సర్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని అద్భుతమైన ఫొటోలు తీయడంతోపాటు వాటితో అందమైన టైమ్‌ల్యాప్స్ వీడియోలను కూడా సృష్టించుకోవచ్చు. ఫిల్టర్ల సాయంతో స్పెషల్ ఎఫెక్ట్లు కూడా సృష్టించుకోవచ్చు. వీడియోలను మెరుపువేగానికి మార్చుకోవడంతోపాటు చాలా స్లోగానూ రన్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ కోసం ట్రీహౌస్... మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని ఉందా? అయితే ట్రీహౌస్ అప్లికేషన్ మీ కోసమే. ఆన్లైన్ పద్ధతిలో ప్రోగ్రామింగ్ మెళకువలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌తో రూబీ ఆన్ రెయిల్స్, పీహెచ్‌పీ, పైథాన్ వంటి వాటిని ఉపయోగించే నైపుణ్యం కలిగించేందుకు ఈ అప్లికేషన్లో వెయ్యికిపైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. చిన్నచిన్న క్విజ్లు సవాళ్లతో ప్రోగ్రామింగ్‌ను నేర్చుకోవడం కూడా సరదాగా మార్చేస్తుంది. మీరు నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. ఐఓఎస్‌పై కిండ్లేకి కొత్త సొబగులు! ఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై అప్లికేషన్లు కొత్త కళను సంతరించుకొంటున్నాయి. ఐడివైజ్లను వాడే వాళ్లు ఐఓఎస్ 8కి అప్డేట్ అయితే అప్లికేషన్లు కొత్త అనుభవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి అమెజాన్స్ కిండ్లే. ఐ డివైజ్‌లపై పుస్తకాలను చదివేందుకు కిండ్లే ఉత్తమమైన అప్లికేషన్. ఆన్లైన్ మెంబర్షిప్ ద్వారా పుస్తకాలు చదవడానికి అవకాశం ఇస్తుంది ఇది. కొత్త అప్డేట్స్తో కూడిన కిండ్లే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకొంటే... వాడకం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి అప్లికేషన్ క్లోజ్ అయినా.. తర్వాత ఓపెన్ చేసుకొన్నప్పుడు డెరైక్ట్‌గా అదే పేజ్‌లోకి వెళ్లిపోవచ్చు. ఇలాంటి మెరుగులతో కిండ్లే అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. -
విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేక టాబ్లెట్
న్యూఢిల్లీ: ప్రైవేటు స్కూళ్ల కోసం పలు ఆధునిక ఫీచర్లతో కూడిన ప్రత్యేక ట్యాబ్లెట్‌ను సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఆవిష్కరించింది. ఏసర్, ఎంబీడీ గ్రూప్, టాటా టెలిసర్వీసెస్లతో కలసి రూపొందించిన దీని ధర రూ. 24,999. దేశంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకూ దీన్ని అందుబాటులో ఉంచారు. అత్యాధునిక క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ విండోస్ 8.1 ట్యాబ్లెట్లో హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎండలో సైతం చదవడానికి హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే దోహదపడుతుంది. ఆఫీస్ 365 ఎడ్యుకేషన్ ఏ2, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ (ఎంఓఎస్) సర్టిఫికేషన్లను ఇందులో చేర్చారు. వివిధ రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈల కోసం ఎంబీడీ పబ్లిషింగ్ హౌస్ రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ కరిక్యులమ్‌ను కూడా ఈ టాబ్లెట్‌లో పొందుపర్చారు.