breaking news
William Porterfield
-
LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు! ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది. చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై -
ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ మూలస్థంభం
ఐర్లండ్ జట్టు నుంచి మరో స్టార్ క్రికెటర్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయాల్లో మూలస్థంభంలా నిలిచిన అతను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. కాగా పోర్టర్ ఫీల్డ్ 148 వన్డేల్లో 11 సెంచరీలు సహా 4343 పరుగులు చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో పాక్‌పై గెలుపు, 2009 టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై, 2011 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయాల్లో పోర్టర్‌ఫీల్డ్ భాగంగా ఉన్నాడు. అంతేకాదు ఐర్లండ్‌కు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత పోర్టర్‌ఫీల్డ్ సొంతం. ఆటకు గుడ్‌బై చెప్పిన పోర్టర్‌ఫీల్డ్ ఇక నుంచి కోచ్ పాత్రలో మెరవనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఐర్లాండ్ పోర్టర్ఫీల్డ్తో తమ అనుబంధాన్ని ట్విటర్లో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 🎥: GREAT MEMORIES As we say farewell to a legend of Irish cricket, let’s look back at some great memories of @purdy34 in action.#ThankYouPorty #BackingGreen ☘️🏏 pic.twitter.com/tUomTYQcgN — Cricket Ireland (@cricketireland) June 16, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు -
పోర్టర్ ఫీల్డ్ అర్ధసెంచరీ
హామిల్టన్: భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ ఓపెనర్ విలియమ్ ఫోర్టర్ ఫీల్డ్ అర్ధ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 11వ అర్ధసెంచరీ. పాల్ స్టిర్లింగ్ తో కలిసి శుభారంభం అంధించాడు. 89 పరుగులు వద్ద స్టిర్లింగ్(42) అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. ఐర్లాండ్ 25 ఓవర్లలో 113/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.