breaking news
Will not contest elections
-
Lok Sabha elections 2024: గౌతమ్ గంభీర్ అస్త్ర సన్యాసం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం ఎంపీ గౌతమ్ గంభీర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ కానున్నందున తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ శనివారం ఆయన బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గంభీర్ శనివారం ‘ఎక్స్’లో.. ‘నాకు రాజకీయ బాధ్యతల నుంచి విరామం ఇవ్వాలంటూ గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను. దీనివల్ల రానున్న క్రికెట్ సీజన్లో ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జీలకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. గంభీర్‌ను ఈసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మార్చొచ్చంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. జార్ఖండ్‌లోని హజారీబాగ్ బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతమ్ గంభీర్ బాటలోనే నడుస్తున్నారు. తనకు క్రియాశీల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలంటూ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి శనివారం చెన్నైలో స్పష్టం చేశారు. డీఎంకే పార్టీలో అవినీతి పెచ్చురిల్లిందని పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకునేందుకు త్వరలో మదురై వెళ్ల నున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఓ ప్రముఖ ఆంగ్ల చానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే పార్టీపై అళగిరి నిప్పులు చెరిగిన విషయం విదితమే. డీఎంకే పార్టీలో ప్రజాస్వామ్యం మృగ్యమైందని అన్నారు. తన తండ్రి, కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు డీఏంకే అధినేత ఎం.కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్ కాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. ఆ అంశంపై డీఎంకే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల అలగిరి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కాంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కరుణానిధి ఆగ్రహానికి గురైయ్యారు. దాంతో అళగిరిని కరుణానిధి తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. ఆ కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అళగిరిని బహిష్కరించడంపై ఆయన వర్గం ఆగ్రహంతో ఉండగా, స్టాలిన్ వర్గం మాత్రం ఆనందోత్సాహలతో ఉంది. కరుణానిధి కుమారులు ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ల మధ్య వర్గ పోరు ఇటీవల కాలంలో తీవ్రమైన సంగతి తెలిసిందే.