breaking news
wild protection act
-
పెద్దపులిని రెచ్చగొట్టి మరీ...
తన మానాన తాను వెళ్తున్న మూగ జీవిని వెంటాడారు. రెచ్చగొట్టి మరీ దానిపై కర్రలతో దాడి చేశారు. మృగ చేష్టలకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కోల్‌కతా: సందర్‌బన్స్ నదీలో ఓ పులి నదిని ఈదుకుంటూ కెందో ఐలాండ్ వైపుగా వెళ్తోంది. అదే సమయంలో అటుగా పడవలో వెళ్తున్న కొందరు మత్స్యకారులు దానిని గమనించారు. గట్టిగా అరుస్తూ దానికి దగ్గరగా వెళ్లారు. తిక్క చేష్టలతో దానిని రెచ్చగొట్టడంతో అదికాస్త పడవవైపుగా దూసుకొచ్చింది. దీంతో పడవలో ఉన్న ఓ వ్యక్తి వెదురు బొంగుతో దానిని గాయపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుందని, అయితే గాయపడినప్పటికీ అది ఈదుకుంటూ ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. పులిని గాయపరిచిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి,వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ నిలన్‌జన్ మల్లిక్ తెలిపారు. -
పెద్దపులిని రెచ్చగొట్టి మరీ...వీడియో వైరల్!
-
తాబేళ్లను పెంచుకుంటున్న వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తాబేళ్లను పెంచుకుంటున్న ఓ వ్యక్తి, వాటిని విక్రయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చాడు. దీనికి గాను అతనిపై వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి నార్త్‌జోన్ ఫారెస్టు ఉప్పల్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.బాలయ్య, రేంజ్ ఆఫీసర్ విజయకుమార్ తెలిపిన వివరాలు.. పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో నివాసం ఉండే ఆర్.బాలకృష్ణారెడ్డి అనే రైతు ఆరు నెలలుగా రెండు తాబేళ్లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. వాటిని విక్రయించడానికి ఓఎల్ఎక్స్ డాట్‌కాంలో ఇటీవల ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనను సహయోగ్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రధాన కార్యదర్శి గిరిధర్ గోపాల్, వన్య ప్రాణుల నేర నిరోధక మాజీ స్పెషల్ ఆఫీసర్ మహేష్ అగర్వాల్ చూశారు. గురువారం వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫారెస్టు అధికారులు బాలకృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేసి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం తాబేళ్లు పెంచడం నేరమని, అందుకుగాను బాలకృష్ణారెడ్డిపై రూ. 50 వేలు జరిమానా విధించటంతోపాటు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఎవరైనా వన్య ప్రాణులను పెంచుతుంటే 9394005600, 9866243719 ఫోన్లకు సమాచారం అందించాలని కోరారు. (బోడుప్పల్)