breaking news
wheeler
-
ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాలు 6–9% పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్థిరమైన రిప్లేస్మెంట్(పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం), పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, జీఎస్టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడతాయని రేటింగ్ సంస్థ తెలిపింది.‘పరిశ్రమ అవుట్‌లుక్ ఇప్పట్టకి సానుకూల వైఖరి కలిగి ఉంది. స్థిరమైన డిమాండ్ ఉతమిస్తుంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశం వృద్ధి వేగవంతం కావడానికి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది’ అని పేర్కొంది. పండుగ సీజన్‌కు ముందు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు) డీలర్లకు బలమైన పంపిణీ కారణంగా ఈ జూలైలో టూ వీలర్స్ హోల్‌సేల్ అమ్మకాలు 9% వృద్ధితో 15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో రిటైల్ అమ్మకాలు 6.5% క్షీణించాయి. పట్టణ ప్రాంతంలో డిమాండ్ స్తబ్ధత, అధిక వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల వృద్ధి సైతం కొనసాగొచ్చని తెలిపింది. రాబోయే పండుగ సీజన్ నాటికి రిటైల్ డిమాండ్ పుంజుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
మహీంద్రా ఇ-రిక్షా నడిపిన బిల్ గేట్స్ వీడియో వైరల్, ఆనంద్ మహీంద్ర స్పందన
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ భారత పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనకెదురైన కొత్త కొత్త అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వంట చేస్తున్న వీడియో షేర్ చేయగా అది ఇంటర్నెట్లో వైరల్ అయింది. అలాగే తన క్లాస్ మేట్, వ్యాపారవేత్త ఆనంద్మహీంద్రాతో భేటీకావడం ప్రముఖంగా నిలిచింది. తాజాగా మహీంద్రా ట్రియో ఆల్-ఎలక్ట్రిక్ రిక్షాను నడుపుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇన్నోవేషన్స్‌కు భారీ మద్దతిస్తే బిట్ గేట్స్ మహీంద్ర ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘బాబు సంజో ఇషారే’ నేపథ్య సంగీతంతో కూడిన పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ ఆకర్షిస్తోంది. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమలో ఇ-రిక్షాలతో డీకార్బనైజేషన్‌కి దోహదం చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. "గేట్స్ నోట్స్" అంటూ బిల్ గేట్స్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఇ-రిక్షాను ఆన్ చేసి,131కిమీ (సుమారు 81 మైళ్లు) వరకు ప్రయాణించే ఎలక్ట్రిక్ రిక్షాను నడిపా. నలుగురిని మోసుకెళ్లవచ్చు అంటూ తన స్పెషల్ డ్రైవింగ్ అనుభవాన్ని పంచుకున్నారు. వ్యవసాయం నుండి రవాణా వరకు కార్బన్ ఉద్గారాలు లేని ప్రపంచంకోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్-19 తర్వాత బిల్ గేట్స్ ఇండియాకు రావడం ఇదే మొదటిది. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) కాగా 2021 చివరలో లాంచ్ చేసిస మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ధర రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). 7.37 kWh సామర్థ్యంతో 48V లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల 50 నిమిషాలు పడుతుంది. దీనికి గరిష్ట వేగం గంటకు 50కిమీ . ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80కిలోమీటర్లు ప్రయాణించగలదు. రియర్, అండ్ ఫ్రంట్ హైడ్రాలిక్ బ్రేక్స్తోపాటు, అలాగే పార్కింగ్ కోసం మెకానికల్ లివర్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. ఆనంద్ మహీంద్ర స్పందన మరోవైపు బిల్ గేట్స్ పోస్ట్‌పై ఆనంద్‌మహీంద్ర కూడా స్పందించారు. "చల్తీ కా నామ్ బిల్ గేట్స్ కీ గాడి" అంటూ మహీంద్ర ట్రియోని చూడటానికి బిల్ గేట్స్‌కి సమయం దొరికినందుకు చాలా సంతోషం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. అలాగే మీ నెక్ట్స్ ఎజెండాలో నాతోపాటు, మీరు సచిన్ తెందూల్కర్, ముగ్గురి మధ్య 3- వీలర్ ఈవీ డ్రాగ్ రేస్ ఉండేలా చూడండి అంటూ ఆయన పేర్కొనడం విశేషం. “Chalti ka Naam Bill Gates ki Gaadi” So glad you found the time to check out the Treo @BillGates Now on your next trip’s agenda should be a 3-wheeler EV drag race between you, @sachin_rt and me… pic.twitter.com/v0jNikYyQg — anand mahindra (@anandmahindra) March 6, 2023 -
నోట్ల రద్దుతోరుణ డిమాండ్ డౌన్
ద్విచక్ర, కన్సూమర్ రుణాలపై ప్రభావం: సిబిల్ ముంబై: ద్విచక్ర, వినియోగ వస్తు(టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్) రుణాలపై డీమోనిటైజేషన్(నోట్ల రద్దు) ప్రభావం తీవ్రంగా పడిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ పేర్కొంది. ‘టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్ రుణాల్లో సాధ్యమైనంత వరకు ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వాటానే ఎక్కువ. వీటిపై నోట్ల రద్దు చాలా ప్రతికూల ప్రభావం చూపింది’ అని సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అమృత మిత్ర తెలిపారు. ప్రాంతాలల్లో వారీగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డులు, ఇతర వాహన రుణాలు సహా పలు కన్సూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల డిమాండ్ కూడా నవంబర్ 8 తర్వాత పడిపోయిందని చెప్పారు. 2015 జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంతో పోలిస్తే 2016 ఇదే సమయంలో వినియోగ వస్తు రుణాల డిమాండ్ 35 శాతంమేర ఎగసిందని అమృత మిత్ర తెలిపారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం పలు విభాగాల్లోని పరిస్థితులు తారుమారు అయ్యాయని, డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన రుణ దరఖాస్తులు ఆశించిన (14 లక్షలు) స్థాయి కన్నా 43 శాతంమేర తక్కువగా వచ్చాయని తెలిపారు. వినియోగ వస్తు విభాగపు రుణ దరఖాస్తుల్లో 60 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొన్నారు.