breaking news
wheat crops
-
కొనేదెలా? తినేదెలా!, నిత్యావసర సరుకుల ధరలు సుర్రు..సుర్రుమంటున్నాయ్!!
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ ఇతర దేశాలకు శాపంగా మారింది. మొక్కజొన్న, గోధుమలకు హబ్‌గా పేరొందిన ఆ రెండు దేశాల సంక్షోభం గ్లోబల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే నిత్యవసర ధరలు, చమురు ధరలు పెరగడంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్- రష్యా దేశాల నుంచి ఎగుమతయ్యే గోదుమల ధరలు భారీగా పెరిగినట్లు యూఎన్ ఫుడ్ ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) తెలిపింది. ఇప్పటి వరకు ఇతర దేశాలకు రష్యా 18శాతం గోదుమల్ని ఎగుమతి చేస్తుంటే.. 2019లో ప్రపంచ గోధుమల ఎగుమతుల మార్కెట్లో రష్యా-ఉక్రెయిన్ ఈ రెండు దేశాల వాటా 25.4 శాతంగా ఉండేది. అయితే రష్యా -ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి వారం రోజుల ముందే గోధుమల ధరలు 55శాతం పెరగ్గా.. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు ఒక్క ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో 24.1శాతం పెరిగినట్లు ఎఫ్ఏఓ వెల్లడించింది. యూరప్ దేశాలకు దెబ్బే! ఉక్రెయిన్ నుంచి గ్లోబల్‌గా మొక్కజొన్న 16శాతం ఎగుమతి అవుతుంటే, రష్యా- ఉక్రెయిన్ దేశాల నుంచి 30శాతం గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. రష్యా గోధుమల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడీ ఈ యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ కు భారీ షాకనే చెప్పుకోవాలి. ఉదాహరణకు యూరప్ కంట్రీస్‌లో ఓ దేశమైన టర్కీకి రష్యా నుంచి 78శాతం గోధుమలు ఎగుమతి అవుతుంటే 9శాతం ఉక్రెయిన్ నుంచి రవాణా అవుతున్నాయి. ఇప్పుడీ యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. ఆహార ధరలు ఆకాశన్నంటాయి. నట్టేట ముంచిన నల్ల సముద్రం సముద్ర రవాణాకు నల్లసముద్రం ప్రసిద్ధి. ప్రపంచంలో ధాన్యాన్ని ఎగుమతి చేసే రెండో రవాణా ప్రాంతంగా ఈ నల్ల సముద్ర భూభాగంలో ఉన్న దేశాలుగా కొనసాగుతుంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ధాన్యం రవాణా పూర్తిగా ఆగిపోవడంతో ప్రపంచ దేశాలకు చెందిన కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. భారత్ సంగతేందీ? ప్రపంచ దేశాలకు చెందిన పలు దేశాలకు ఉక్రెయిన్ - రష్యా దేశాల నుంచి గోధుమలు, మొక్కజొన్న ఎగుమతులు కాకపోవడం తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నాయి. కానీ మనదేశంపై ఎలాంటి ప్రభావం పడలేదని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.భారత్ గోధుమల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొన్నేళ్లుగా ఈ ఎగుమతుల విషయంలో భారత్ ప్రధాన ఎగుమతి దేశంగా ప్రసిద్ధి చెందింది. 2020లో మనదేశం $243,067,000 ఖరీదైన గోధుమల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) లెక్కల ప్రకారం 2020-2021 జులై నుంచి జూన్ మధ్య కాలంలో భారత్ 1.8 మిలియన్ టన్నుల గోధుమల్ని ఎగుమతి చేసినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ దేశాల ప్రభావం ఆహారా ధాన్యాల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ భవిష్యత్‌లో భారత్ తీసుకున్న తటస్థ ధోరణి ఎగుమతుల విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. చదవండి: పుతిన్.. నీకు అర్థమవుతుందా? సెమీకండక్టర్లకు యుద్ధం దెబ్బ -
అకాల వర్షం
కల్హేర్, న్యూస్‌లైన్: జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. దీంతో ప లుచోట్ల పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెట్లు నేల వాలాయి. కల్హేర్ మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలాఉండగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్హేర్, మార్డి చోట్ల పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై చెట్లు విరిగి పడ్డాయి. వర్షంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖేడ్‌లో గంటపాటు.. నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం సా యంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో పాటు గంట సే పు వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో విద్యు త్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. చల్లబడిన వాతావరణం మెదక్ మున్సిపాలిటీ: మెదక్‌లో శుక్రవారం సాయంత్రం కురి సిన చిరుజల్లులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపగా, సా యంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఐదు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. కాగా వేసవి సమీపిస్తున్న తరుణంలో కురుస్తున్న వర్షం వల్ల మరింతగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దుబ్బాకలో చిరుజల్లులు దుబ్బాక: దుబ్బాకలో చిరు జల్లులతో కూడిన వర్షం కురిసిం ది. గురువారం రాత్రి ఈదురు గాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా చిరుజల్లు లు కురిశాయి. అయితే గత ఐదు రోజులుగా ఈదురు గాలు లు వీస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా గే వర్షాలు కురిస్తే మామిడి, ఇతర పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్థం చేస్తున్నారు. కురిసింది వాన జహీరాబాద్ టౌన్: జహీరాబాద్‌లో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. సాయంత్రం సన్నని జల్లులతో ప్రాంభమైన వాన ఆ తరువాత ఉరుములు, మెరుపులతో ఓ మోస్తారుగా కురి సింది. దీంతో పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. ప్రధానంగా బ్లాక్ రోడ్డుతో పాటు జాతీయరహదారిపై బాగారెడ్డి విగ్రహాం వద్ద నీరు నిలిచిపోయింది. సుభాష్‌గంజ్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు వచ్చిచేరింది. గురువారం రాత్రి కూడా సన్నని జల్లులు పడ్డాయి. ఎగిరిన రేకులు న్యాల్కల్, న్యూస్‌లైన్: మండలంలో శుక్రవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు లు ఎగిరిపోయాయి. అదేవిధంగా మండల పరిధిలోని హుస్సెళ్లి గ్రామ సమీపంలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాల య్యాయి. కర్నాటక రాష్ట్రం జబ్గి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు గ్రామంలో చెరకు నరకడానికి వచ్చారు. గ్రామ సమీపంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఉన్నట్లుండి గాలి వాన రావడం, గుడిసెలు కొట్టుకపోవడంతో పప్పు, బియ్యం ఇతర సామగ్రి కూడా పూర్తిగా పాడైపోయాయి. అంతే కాకుండా కమలాబాయి చేయి విరిగి పోగా చెట్టు కొమ్మ విరిగి మీదపడిన సంఘటనలో రెండేళ్ల బాలునితోపాటు మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యా యి. ఉన్నట్లుండి ఒకే సారి గాలితో కూడిన వడగండ్ల వాన రావడంతో గిరిజనులు భయందోళనకు గురై పరుగులు తీశా రు. వారు పూర్తి నిరాశ్రయులు కావడంతో గ్రామానికి చెంది న ఎండీ అఫీజ్,ఎండీ.మైపూజ్ మాస్టార్ వారికి స్థానిక పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా వారికి బియ్యం ఇతర వస్తువులు అందజేశారు.