breaking news
Walnut App
-
వీర్యవృద్ధికి... బాదాం, పిస్తా, వాల్నట్, జీడిపప్పు
జీవనశైలి మార్పులతో సంతాన లేమి సమస్యలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. బాదాం, జీడిపప్పులతోపాటు పిస్తా, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ను రోజు గుప్పెడు తీసుకోవడం ద్వారా వీర్యకణాలు వృద్ధి చెందడంతోపాటు వాటి కదలికలు కూడా చురుకు అవుతాయని వీరు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొంతమంది ఆరోగ్యవంతమైన పురుషులపై తాము 14 వారాలపాటు అధ్యయనం చేశామని.. వీరందరినీ రెండు గుంపులుగా విడగొట్టి.. ఒకరికి సాధారణ ఆహారం.. ఇంకొక వర్గానికి డ్రైఫ్రూట్స్ ముఖ్యంగా నట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అందించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. రోజుకు 60 గ్రాముల బాదాం, హేజల్, వాల్నట్స్లు అందించామని, 14 వారాల తరువాత చూసినప్పుడు వీరి వీర్యకణాలు 16 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలిందని, కదలికలు ఆరు శాతం పెరిగినట్లు తెలిసిందని అలన్ పేసీ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ మార్పులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ సంతానలేమికి కారణమని భావిస్తున్న ఇతర అంశాల్లోనూ సానుకూల ఫలితాలు రావడం తమ అంచనాలను ధ్రువపరుస్తున్నట్లు వివరించారు. -
ఏ ఏటీఎంలో క్యాష్ ఉందో చెప్పే..‘వాల్ నట్’ యాప్!
హైదరాబాద్: పర్సనల్ ఫైనాన్స మేనేజ్మెంట్ యాప్ వాల్నట్ మార్కెట్లో ఉన్న నగదు కొరత సమస్యకు పరిష్కారంగా ఓ సౌకర్యాన్ని తన యాప్‌కు జత చేసింది. దీని ద్వారా 18 లక్షల మంది వాల్నట్ యూజర్లు సమీపంలో ఏ ఏటీఎంలో నగదు ఉందో తెలుసుకునే వీలుంది. అత్యవసరంగా నగదు కావాల్సిన వారు తమ సమీప ప్రాంతాల్లోని అన్ని ఏటీఎం లను చుట్టేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తూనే ఉన్నారుు. వాల్నట్ యూజర్ ఎవరైనా ఏటీఎంలో నగదు తీసుకుంటే ఆ ఏటీఎం, అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారు వంటి వివరాలను వాల్నట్ యాప్ వారి నుంచి సేకరిస్తుంది. తక్కువ క్యూ ఉన్న ఏటీఎంలు, ఎక్కువ క్యూ ఉన్నవి, నగదు లేని ఏటీఎంలను గ్రీన్, ఆరెంజ్, గ్రే రంగుల్లో సూచిస్తుంది.