breaking news
wall dispute
-
ప్ర‘హరీ’పై కలెక్టర్ సీరియస్
సాక్షి, అనంతపురం: ధర్మవరం మండలం దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ గాలికి కూలిపోయిన ఘటనపై కలెక్టర్ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గాలికి కూలిపోవడంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారించి సదరు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంట్రాక్టర్లు హడావుడిగా చేసిన పనులన్నింటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 20 రోజుల్లో నిర్మాణం పూర్తి దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సమీప బంధువు నారాయణప్ప దక్కించుకున్నారు. ఎన్నికల ముందు 20 రోజుల్లోనే పనులు పూర్తి చేయించి టీడీపీ హయాంలోనే బిల్లు డ్రా చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే హడావుడిగా ప్రహరీని నాసిరకంగా నిర్మించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బిల్లు మంజూరు కాలేదు. ఇటీవల వీచిన మోస్తరు గాలికే ప్రహరీ కూలిపోయింది. ఘటనపై ఈనెల 9న ‘ప్ర’హరీ’ శీర్షికతో ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ సత్యనారాయణ ఎస్ఎస్ఏ పీఓ రామచంద్రారెడ్డి, డీఈలతో మాట్లాడారు. పని ఎవరు చేశారు.. ఎలా చేశారు.. నాసిరకంగా నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో పాటు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌తో ఫిర్యాదు ఇప్పించి కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయిస్తామని ఎస్ఎస్ఏ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రహరీ నిర్మాణాలపై విచారణ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చాలాచోట్ల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. 15–20 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు పెట్టేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో అధికారులు కూడా నోరు మెదపకుండా కొందరికి బిల్లులు కూడా ఇచ్చేశారు. మరికొందరి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ చేయించేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయా పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉందో పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్లలో వణుకు మొదలైంది. -
పోలీస్ + రెవెన్యూ గోడ వివాదం
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కాలనీ ప్రజలకు రహదారి లేకపోవడం తో కలెక్టర్ ఆదేశాల మేరకు కల్యాణ మండపం ప్రహరీని తొలగించడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల మధ్య వివాదం రేగింది. ప్రహరీ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధపడగా, పోలీసు అధికారులు అడ్డుపడ్డారు. విజయనగరం పట్టణంలోని పోలీసులకు చెందిన దండుమారమ్మ కల్యాణ మండపం గోడను తొలగించేందుకు ఆర్డీఓ వెంకటరావు, విజయనగరం తహశీల్దార్ పెంటయ్య, మున్సిపల్ ఇంజినీర్ ఎం.బాబు కల్యాణమండపం వద్దకు ఆదివారం మధ్యాహ్నం పొక్లెయినర్‌తో చేరుకుని గోడను కూల్చేందుకు సిద్ధపడ్డారు. జిల్లాకు బందోబస్తు కోసం వచ్చి కల్యాణ మండపంలో ఉంటున్న బీఎస్ఎఫ్కు చెందిన కానిస్టేబుళ్లు అడ్డంగా నిలుచుని గోడను కూలగొట్టకుండా అడ్డుకున్నారు. ఈ దశలో ఆర్డీఓ, అక్కడున్న పోలీసు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. మీరుకాని, మీ అధికారి గాని ఏదైనా మాట్లాడాలనుకుంటే, కలెక్టర్‌తో మాట్లాడుకోవాలని ఆర్డీఓ సూచించారు. పావుగంట సమయం కావాలని పోలీసులు అడిగారు. అరగంటైనా పోలీసు అధికారులు రాకపోవడంతో గోడను కూల్చేయాలని ఆర్డీఓ ఆదేశించా రు. పొక్లెయినర్‌తో ప్రహరీ పక్కనే ఉన్న మట్టిని తొలగిస్తు న్న సమయంలో ఒకటో పట్టణ సీఐ కె.రామారావు సంఘట న స్థలానికి వచ్చి ఆర్డీఓ వెంకటరావుతో మాట్లాడి కొంత సమయం కావాలని ఎస్పీతో మాట్లాడతామని కోరారు. ఈలోగా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ ఒకటో పట్టణ సీఐకి ఫోన్‌చేసి ఆర్డీఓకు ఫోన్ ఇవ్వాలని కోరారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఆర్డీఓ అనంతరం కలెక్టర్ వద్దకు వెళ్లారు. విజయనగ రం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను ఆరా తీశారు. దండుమారమ్మకాలనీకి వెళ్లేందుకు దారి చూపి మీరే న్యాయం చేయాలని స్థానిక మహిళలు డీఎస్పీని అడిగారు. గోడను తొలగించి మాకు దారి చూపించకుండా పొక్లెయినర్‌ను వెళ్లనీయబోమంటూ అడ్డుకున్నారు. ఒకటో పట్టణ సీఐ మాట్లాడుతూ మీకు ఏదైనా సమస్య ఉంటే ఆర్డీఓకు తెలపాలని ఇలా అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. దీంతో స్థానికులు పొక్లెయినర్‌ను విడిచిపెట్టి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. ఏడాదిగా నలుగుతున్న వివాదం దండుమారమ్మ కాలనీలో నివాసం ఉండే ప్రజలు ఎస్.కోట రోడ్డు వైపు వెళ్లేందుకు గతంలో తోవ ఉండేది. ఆ తోవలో స్థలం ఉన్న యజమాని రామారావు ప్రహరీ కట్టేయడంతో వీరికి రహదారి లేకుండా పోయింది. కల్యాణ మండపం గోడ తొలగించి తమకు దారి చూపించాలని దండుమారమ్మకాలనీ వాసులు అప్పట్లో జాయింట్ కలెక్టర్,ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. అప్పటినుంచి గ్రీవెన్స్‌సెల్‌లో అనేకమార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. దీంతో దండుమారమ్మ కల్యాణ మండపం ప్రహరీ గోడను కొంత తొలగించి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. మున్సిపల్ అధికారులు అనేకమార్లు తొలగించడానికి వెళ్లినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మంత్రి వద్దకు పంచాయితీ దండుమారమ్మకాలనీవాసులసమస్య మంత్రి బొత్స సత్యనారాయణ వద్దకు వెళ్లినట్లు తెలిసింది. రెవెన్యూ,పోలీస్ వర్గాలను పిలిచి ఆయన మాట్లాడి నెలరోజుల్లో పరిష్కార మార్గాన్ని చూపించాలని చెప్పినట్లు సమాచారం.