breaking news
wage facts
-
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
సాక్షి, పెద్దపల్లిరూరల్ : గౌరవ వేతనం చెల్లించడంతోపాటు పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని రేషన్‌డీలర్లు జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెం కటేశం మాట్లా డుతూ... కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబర్ నుంచి పెంచిన కమీషన్, పాత బకాయిలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేయడం తగదన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించుకున్నా... ఇప్పటికి ఫలితం లేదని వాపోయారు. బకాయి ఉన్న 400 కోట్ల రూపాయల కమీషన్‌ను వెంటనే చెల్లించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న బియ్యం పంపిణీతో తమకు అందే కమీషన్ రేటు సరిపోవడంలేదన్నారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల ఒకటి నుంచి సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు మద్దెల నర్సయ్య, ఎలబోతారం శంకరయ్య, అడిచెర్ల రమేశ్, నంబయ్య, పెర్క లింగయ్య, కిషన్‌రెడ్డి, జయప్రద, పద్మ, సరస్వతీ, భారతీ, శ్రీనివాస్, ప్రభంజన్‌రెడ్డి, తోట శ్రీనివాస్, సత్యం, సాదిక్‌పాషా పాల్గొన్నారు. -
కాకరకాయ తింటే...
కాకరకాయలో కేలరీలు తక్కువ, పోషకాలు మెండుగా ఉంటాయి. బి1, బి2, బి3, సి... విటమిన్లతోపాటు జీర్ణక్రియకు దోహదం చేసే పీచు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియ్, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. సి విటమిన్ దేహంలోని క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. కడుపులో చేరిన పరాన్నజీవులను హరిస్తుంది. కాకరలోని ఏలియోస్తీరిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గిస్తుంది. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) నుంచి నివారిస్తుంది. కాకరకషాయం మలేరియా బ్యాక్టీరియాను చంపేస్తుంది, చికెన్‌పాక్స్, మీజిల్స్, హెర్ప్స్, హెచ్ఐవి కారక వైరస్‌ను శక్తిహీనం చేస్తుంది. కాకర కషాయాన్ని క్రమం తప్పకుండా తాగుతుంటే పై వైరస్‌ను నిర్మూలనవుతుంది. - ఉషశ్రీ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్