breaking news
viswantha
-
సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హైడ్ అండ్ సీక్’
విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ హైడ్ అండ్ సీక్ ’. సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది. -
‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు
‘సాహితీ సమాలోచనం’లో సామవేదం పాల్గొన్న అతిరథ మహారథులు రాజమహేంద్రవరం కల్చరల్ : సనాతన ధర్మప్రతిష్ఠకు అవతరించిన మహాయోగి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని, ఆయన కవితారూపక తపస్సు చేశారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. తెలుగురథం సంస్ధ ఆధ్వర్యంలో శనివారం త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో జరిగిన విశ్వనాథ సాహితీసమాలోచనంలో సామవేదం పాల్గొని ప్రసంగించారు. విశ్వనాథ వాజ్ఞ్మయమంతా సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిందని, వేదాలలో, వేదాంతంలో విమలార్థాలను ప్రకటించడానికి వచ్చిన సరస్వతీ స్వరూపమే విశ్వనాథ అని అన్నారు.‘సద్యోనిర్గతమైన సర్వ కవితాసంరంభాన్ని’ ఆయన భగవంతునికి నివేదన చేశారు. జీవిత లక్షణాలయిన చావుపుట్టుకల విషవలయంనుంచి బయటపడటానికే ఆయన కవిత్వాన్ని నమ్ముకున్నారు. ‘శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్’ అన్న పోతనామాత్యుని లాగే ఆయన రామాయణ కల్పవృక్షాన్ని మోక్షసాధనకు రచించారని తెలిపారు.‘రామాయణ కల్పవృక్షం లోకానికి కావ్యం, నాకు సాధన’ అని విశ్వనాథ స్వయంగా పేర్కొన్నారని వివరించారు. భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ శ్రీశ్రీ ‘నాకు సంస్కృతం రాదు, వాల్మీకి రామాయణం అర్థమవుతుంది,తెలుగు వచ్చు, విశ్వనాథ కల్పవృక్షం అర్థం కాదు’ అనేవారని గుర్తు చేశారు. విశ్వనాథ రచించిన కల్పవృక్షం గురించి మాట్లాడాలంటే అది వాగ్రూపమైన ఒక సత్రయాగ మవుతుందన్నారు. ‘జీవుని వేదన’ అనే మాటను పట్టుకుని ఆయన కల్పవృక్షాన్ని నిర్మించారని తెలిపారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాహితీ విరాడ్రూపం విశ్వనాథ అని, ఎందరు ఎన్ని రూపాలలో ఆయన కవిత్వాన్ని ఆవిష్కరించినా, చెప్పవలసింది ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు. ఆదాయపుపన్నుశాఖ అధికారి ఓలేటి రామావతారం మాట్లాడుతూ 20వ శతాబ్దపు వటవృక్షం విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదన్నారు.తెలుగు రథం ప్రతినిధి కొంపెల్ల శర్మ ప్రసంగించారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ విశ్వనాథ కవితావైభవాన్నివిపులంగా వర్ణించారు. ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరామ్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు.