breaking news
Vishal Pandya
-
బ్లూ వేల్ గేమ్ నేపథ్యంలో సినిమా, హీరోయిన్గా అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ వంటి వివాదాత్మక సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ నటిస్తున్నట్లు చిత్రయూనిట్ గురువారం ప్రకటించింది. ఇటీవల కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్ర మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. నా పాత్ర సరదాగా, విభిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
నాకు చాలా ఇబ్బందిగా ఉంది సన్నీలియోన్
పోర్న్ తారగా ప్రఖ్యాతి పొంది, తర్వాత బాలీవుడ్ తారగా మారిన సన్నీలియోన్ కూడా కొన్ని విలువల్ని పాటిస్తుందంటే నమ్ముతారా! కానీ ఇది నిజం. ఇటీవల ‘హేట్‌స్టోరి 2’ చిత్రం షూటింగ్ లొకేషన్లో సన్నీలియోన్ ప్రవర్తనే అందుకు నిదర్శనం. వివరాల్లోకెళ్తే- ‘హేట్ స్టోరి 2’ కోసం సన్నీలియోన్‌తో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు విశాల్ పాండ్య. ముంబయ్‌లోని ఓ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే... లొకేషన్లో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారట. అప్పటిదాకా డాన్స్‌లో నిమగ్నమైన సన్నీకి ఉన్నట్లుండి ఆ పిల్లలు కంట పడ్డారు. అంతే... పెద్దగా కేక వేసిందట సన్నీలియోన్. లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత సన్నీ తేరుకొని, ‘‘ముందు ఆ పిల్లల్ని బయటకు పంపేయండి. నేను చేస్తోంది ఐటమ్‌సాంగ్. వారి ముందు అలా చేస్తే ఎలా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’ అనేసిందట. వెంటనే... ప్రొడక్షన్ వాళ్లు అప్రమత్తమై పిల్లల్ని బయటకు పంపేశారట. పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ ఇలా విలువలు పాటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.