breaking news
vijayabhaskara Reddy
-
పోలీసులు చిత్రహింసలు పెట్టారు
విజయవాడ లీగల్/పెనమలూరు (కృష్ణా జిల్లా): ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. జీపులో తిప్పుతూ, స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు’’ అని ఎన్ఆర్ఐ మాలేపాటి విజయభాస్కరరెడ్డి శుక్రవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ సివిల్ జడ్జి రాధిక ఎదుట వాపోయారు. బల్ల మీద పడుకోబెట్టి ఛాతీపై గట్టిగా నొక్కిపట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారని... ఎస్పీనో, డీఎస్పీనో రావడంతో తన ముఖానికి ముసుగేసి, బూతులు తిడుతూ అరికాళ్లు, చేతులు, తలమీద గట్టిగా కొట్టారని తెలిపారు. బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నా జాలి చూపలేదని, స్టేషన్‌లోని అందరినీ బయటకు పంపి, ఏం చేశావో చెప్పమని అడిగారని, జరిగినది చెప్పినా, మేం చెప్పినట్లు నువ్వు వినాలని బెదిరించారని, ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్థుడు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన పెనమలూరు పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈయన లండన్‌లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. పోలీసులు తనను కొడుతున్న సమయంలో బాధతో అరిచిఅరిచి గొంతు పోయిందని తెలిపారు. విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుకు రావడానికి ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, పోలీసులు కొట్టారని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కాగా, కోర్టులో విజయభాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, కొప్పుల శివరామ్, ఆదాము వాదనలు వినిపించారు. ఆయనపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవి అని, కేసులో ఇరికించేందుకే బీఎన్ఎస్ 111 సెక్షన్ చేర్చారని వాదించారు. దీనిప్రకారం పదేళ్లలోపు రెండుసార్లు చార్జిïÙటు నమోదై ఉండాలన్నారు. ఆ సెక్షన్.. పిటిషనర్‌కు వర్తించదని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. పిటిషనర్ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణం ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలోగానీ, ఎయిమ్స్‌లో గానీ వైద్యానికి అనుమతించాలని కోరారు. కాగా భాస్కరరెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. సీఐలు జె.వెంకటరమణ, శివప్రసాద్, ఎస్ఐ రమేష్ కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భాస్కరరెడ్డికి స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షలు చేయించాలని, ఆ సమయంలో ఫొటోలు తీయాలని, నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. -
మొక్కల కొను‘గోల్మాల్’
=టీటీడీ అటవీశాఖ అవినీతి బాగోతం =రూ.200కు లభించే మొక్కకు రెండు వేల బిల్లు =అడుగడుగునా అక్రమాలు =దేవస్థానం ఖజానాకు భారీ కన్నం సాక్షి ప్రతినిధి, తిరుపతి: కంచే చేను మేసిన చందంగా ఉంది టీటీడీ అటవీ శాఖ అధికారుల తీరు. మొక్క ల కొనుగోలు పేరిట దేవస్థానం ఖజానాకు అటవీ విభాగం అధికారులు కన్నం పెడుతున్నారు. గతంలో కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడి విజిలెన్స్ విచారణను ఎ దుర్కొన్న అటవీ విభాగం తాజాగా తిరుపతిలో డివైడర్లపై వేసిన మొక్కల పేరిట లక్షల్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు నుంచి అలిపిరి వరకు ఉన్న రహదారి డివైడర్‌పై అటవీ విభాగం అధికారులు రెండు రకాల మొక్కలను నాటారు. బయట మార్కెట్లో వంద నుంచి రెండు వందల రూపాయలకు లభ్యమయ్యే ఈ మొక్కలకు రెండు వేల రూపాయల వరకూ బిల్లు పెట్టడం వివాదాస్పదంగా మారింది. విజయభాస్కరరెడ్డి అనే ఫారెస్ట్ మజ్దూర్ ద్వారా ఈ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. లక్షల రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసేప్పుడు టెండర్ పిలవకుండా ఇష్టానుసారం వ్యవహరించడంపై ఇ ప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వక్క చెట్టును పోలివుండే ఫాక్స్‌టైల్ ఫామ్ చెట్టును రూ.2000కు, చిన్న గుబురుగా ఉండే పైటస్ మొక్కను రూ.350 రూపాయలకు కొనుగోలు చేసినట్లు దేవస్థానం డీఎఫ్‌వో కే. వెంకటస్వామి ‘సాక్షి’తో చెప్పారు. లేబర్ యూనియన్లకు ప నులు అప్పగించడం వల్ల మంచి ఫలితాలు ఉం టాయన్న భావనతో లక్షల రూపాయలతో మొ క్కలు కొనుగోలు చేసినా టెండర్ పిలవలేదని స్పష్టం చేశారు. 2012 నాటి తుడా ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు ఆయన వివరిం చారు. మొక్కల కొనుగోలులో తుడా భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. రా ష్ట్ర అటవీ, హార్టికల్చర్ శాఖలు నిర్ణయించిన ధరలను పక్కనపెట్టి దేవస్థానం ఆటవీ శాఖాధికారులు తుడా ధరలను అమలు చేయడంతోనే అ వినీతికి తలుపులు తెరుచుకున్నాయి. తిరుపతిలోని నర్సరీల్లో ఫాక్స్‌టైల్ ఫామ్ రూ.200 రూపాయలకు, పైటస్ రూ.50 నుంచి రూ.75 మధ్య లభ్యమౌతున్నాయి. టీటీడీ కోసం అయి తే ఇంతకంటే తక్కువ ధరలకు ఈ మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినా రెండో కంటికి తెలియకుండా, టెండర్ పిలవకుండా ఈ వ్యవహారం నడపడం వెనుక ఉన్న ఉద్దేశం లక్షల రూపాయలు వెనుకేసుకోవడమే అని తెలిసింది. తిరుచానూరు నుంచి అలిపిరి వరకూ 14 కిలోమీటర్ల దూరంలో మొక్కలు నాటే భారీ ప్రాజెక్టును ప్రారంభించే ముందు టెండర్ ప్రక్రియకు వెళ్లకపోవడం వెనుక దేవస్థానం పరిపాలనా విభాగంలోని ఉన్నతస్థాయి అధికారుల హస్తముందున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం అటవీ శాఖకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరయ్యాయి. మొక్కల కొనుగోలులోనే నిబంధనలకు పాతరేసిన అధికారులు ఈ ప్రాజెక్టుల విషయంలో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


