breaking news
Vehicle lanes
-
చమురు ధరల మంట
ఆదిలాబాద్‌టౌన్: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.వంద వైపు వేగంగా పరుగులు తీస్తున్నాయి. నెలరోజుల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ.84.50 ఉండగా, తాజాగా పెరిగిన ధరతో రూ.90కి చేరింది. ప్రతిరోజు ధర మారుతూనే ఉంది. రాత్రి 12 గంటల వరకు ఒక ధర ఉంటే, తెల్లారేసరికి బోర్డుపై మరో ధర దర్శనమిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుల నడ్డీ విరుగుతోంది. చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుండగా, పెరుగుతున్న ఈ ధరలు మరింత అదనపు భారంగా మారాయి. సామాన్య ప్రజలపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరల పెరుగుదలతో రవాణా రంగం కుదేలవుతోంది. ఆటోలు నడిపే డ్రైవర్లు, ట్రాక్టర్, ఇతర ప్రైవేట్ వాహన యజమానులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకో, మూడు నెలలకోసారి పెట్రో ధరలు పెరిగేవని, ప్రస్తుతం ఈ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు ధరలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని వాపోతున్నారు. రోజురోజుకు పైపైకి.. రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.89.95 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.82.59కి చేరింది. ఈ నెల 1న పెట్రోల్ లీటరు ధర రూ.84.98 ఉండగా, నెలరోజులు గడవక ముందే రూ.90కి చేరింది. గతంలో డీజిల్, పెట్రో ల్ ధరల మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ప్రస్తుతం ఐదారు రూపాయల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధరలు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనచోదకులతోపాటు సామాన్య జనాలు సైతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళన నేపథ్యంలో లీటరు ధరలో కొంత పైసలు తగ్గించినా మళ్లీ రోజురోజుకు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 25 వరకు పెట్రోల్‌బంక్‌లు ఉన్నాయి. రోజు 25వేల లీటర్ల పెట్రోల్ విక్రయాలు, 50వేల లీటర్ల వరకు డీజిల్ విక్రయాలు జరుగుతాయని పెట్రోల్‌బంక్‌ల యజమానులు పేర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో జిల్లా వాసులపై అదనపు భారం పడుతూనే ఉంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌పై రూ.17 వరకు, లీటరు డీజిల్‌పై రూ.14 వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నెల్లోనే ఇంత ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు 25 పైసల నుంచి 50పైసల వరకు పెరుగుతండడంతో ధర పెరిగిందని వినియోగదారులకు ధర పెరుగుతున్న విషయం తెలియడంలేదు. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర రూ.100కు చేరుకునే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించి ఇబ్బందులను తొలగించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ధరలు తగ్గించాలి బీజేపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు విపరీంగా పెరిగా యి. ఎన్నికల ముందు పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారు. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆటో నడిపించి కుటుంబాన్ని పో షించడం భారంగా మారుతోంది. వాహనదారులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. – ఇమ్రాన్, ఆటోడ్రైవర్, ఆదిలాబాద్ రోజూ పెంచుడే.. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. మోటార్‌సైకిల్ నడపాలంటే భయమేస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.90కి చేరింది. మరో నెలరోజుల్లో రూ.100కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. వెంటనే ధరలను నియంత్రించాలి. – రిజ్వాన్, వాహనదారుడు,ఆదిలాబాద్ -
వాహనదారులూ జాగ్రత్త
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే చలానా తప్పదు నగరంలో అడుగడుగునా నిఘా నేత్రాలు 240 జంక్షన్లలో 350 సీసీ కెమెరాలు మరో 200 హ్యాండ్ కెమెరాలు ఈ ఏడాది 31,05,445 ఉల్లంఘన కేసులు నమోదు సగటున ప్రతీరోజు 8508 మంది..., గంటకు 354 మంది.., నిమిషానికి ఆరుగురు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు సిటీబ్యూరో: వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త... ట్రాఫిక్ పోలీసులు లేరుకదా అని నిబంధనలను ఉల్లంఘించి వాహనం నడిపితే చలానా బారిన పడతారు. ఎక్కడ? ఎప్పుడు, ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారనే సాక్ష్యాలతో సహా ట్రాఫిక్ పోలీసులు మీ ఇంటికి చలాన్ పంపిస్తారు. నగరంలోని 240 జంక్షన్లలో ఉన్న సుమారు 350 సీసీ కెమెరాలు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే ఫొటోలు తీసేస్తున్నాయి. అలాగే, ప్రతీ చిన్నజంక్షన్, రహదారులపై 200 మంది కానిస్టేబుళ్ల చేతిలో ఉన్న కెమెరాలతోనూ ఫొటోలు తీస్తున్నారు. ఈ ఏడాది 31,05,445 మంది ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు వాహనం నడుపుతున్న వాహనదారులు ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇంటికి వస్తున్న చలానా చూసి కంగుతింటున్నారు. గతంలో ఉల్లంఘనకు పాల్పడితే రూ.100 చ లానా విధించేవారు.. అది ఇప్పుడు రూ.1000కి చేరింది. ఈ నే పథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే టాప్ 20 జంక్షన్లలో మొదటి స్థానం ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు చౌరస్తా ఉంది. ఇక్కడ గత రెండేళ్లలో 53161 మంది రాగ్సైడ్ డ్రైవింగ్ చేసి చలానా బారిన పడ్డారు. ఇక రెండో స్థానంలో గోషామహల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్ఏ బజార్ చౌరస్తా ఉంది. ఇక్కడ కూడా రాగ్సైడ్ డ్రైవింగ్ చేసిన 48833 మందిపై చలానా కొరడా జుళిపించారు. ఇక మూడో స్థానంలో నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్వీఎస్ కళాశాల చౌరస్తా దక్కించుకుంది. ఇక్కడ 34247మంది చలానా బారిన పడ్డారు. ఇక ఉల్లంఘన తీరును గమనిస్తే 82 రకాల ఉల్లంఘనలు ట్రాఫిక్ విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది అన్ని రకాల ఉల్లంఘనల్లో మొత్తం 31,05,445 కేసులు నమోదు కాగా... అందులో మొదటి స్థానంలో అత్యధికంగా ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఆన్ టాప్ (పరిమితికి మించి ఎత్తు/ పొడుగులో సామగ్రి తరలింపు) కేసులు 5,16,613 గూడ్స్ వాహనాలపై కేసులు నమోదయ్యాయి, రెండో స్థానంలో పార్కింగ్ ఆన్ సర్వీస్ రోడ్స్ కేసులు 4,80,509, మూడో స్థానంలో రాంగ్‌సైడ్ డ్రైవింగ్ 4,42,591 ఉన్నాయి.