breaking news
Veerapan
-
విడుదలకు రెడీ అవుతున్న బాలీవుడ్ వీరప్పన్
సౌత్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్లో మకాం వేసిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్యే వీరప్పన్ సినిమాను ఎనౌన్స్ చేసిన వర్మ, అప్పుడే ఆ సినిమా రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. సౌత్‌లో కేవలం వీరప్పన్ కోసం సాగించిన వేటనే కథాశంగా సినిమా రూపొందించిన వర్మ హిందీలో మాత్రం వీరప్పన్ జీవితకథను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ భరద్వాజ్‌తో పాటు సచిన్ జోషి, ఉషా జాదవ్, లిసారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు కర్ణాటక మాఫియా డాన్ జీవిత కథ ఆధారంగా రాయ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో రాయ్ పాత్రలో వివేక్ ఒబరాయ్ నటిస్తున్నాడు. వర్మ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నాడు వివేక్. వీటితో పాటు టాలీవుడ్లో విజయవాడ రౌడీయిజం నేపథ్యంలోవంగవీటి సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు వర్మ. -
వర్మకు షాకిచ్చిన వీరప్పన్
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఎలా చనిపోయాడు అన్న అంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు వర్మ. ఈ సినిమాలో.. వీరప్పన్ చేతిలో కిడ్నాప్‌కు గురైన కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడు హీరోగా నటించటంతో కిల్లింగ్ వీరప్పన్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో జనవరి 1న రిలీజ్ చేస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఇప్పుడు మరో వీరప్పన్ తెలుగు థియేటర్లలో పోటీకి రెడీ అవుతున్నాడు. 2013లో యాక్షన్ స్టార్ అర్జున్, కిశోర్ ప్రధాన పాత్రల్లో వనయుద్ధం పేరుతో వీరప్పన్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు ఇదే సినిమాను వీరప్పన్ పేరుతో జనవరి 1న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ చేస్తున్న ప్రచారం తమ సినిమాకు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు వీరప్పన్ నిర్మాతలు. మరి ఈ ఇద్దరు వీరప్పన్లలో తెలుగు ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో చూడాలి. -
‘వీరప్పన్’ వారసులొచ్చారు
సాక్షి, నెల్లూరు : వెలుగొండ అడవుల్లో లభించే అరుదైన ప్రకృతి సంపద ఎర్రచందనంపై గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరుల వారసుల కన్నుపడింది. వారిలో కొందరు స్మగ్లర్లు, కూలీలుగా అవతారమెత్తి అడవులను కొల్లగొట్టేస్తున్నారు. వందల సంఖ్యలో కూలీలను రంగంలోకి దించి ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సూళ్లూరుపేట వద్ద తమిళనాడుకు చెందిన ముగ్గురు స్మగ్లర్లు, 90 మంది కూలీలు అటవీశాఖ అధికారులకు చిక్కారు. వీరి తండ్రులు, తాతలు అప్పట్లో వీరప్పన్‌కు ముఖ్యఅనుచరులుగా వ్యవహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని తూర్పుకనుముల్లో ఉన్న వెలుగొండ అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఇప్పటివరకు వెంకటగిరి, డక్కిలి, రాపూరు, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు, సీతారామపురం మండలాలకు చెందిన పలువురు స్మగ్లర్లుగా అవతారమెత్తి ఎర్రచందనాన్ని సరిహద్దులు దాటించేవారు. కొండకింది గ్రామాల్లోని కూలీలతోనే ఎక్కువగా ఎర్రచందనం చెట్లను నరికించేవారు. అడవుల్లో అడ్డదారులు వీరికి కొట్టిన పిండి కావడంతో రవాణాకు సైతం స్థానిక కూలీలనే ప్రధానంగా వినియోగించుకునేవారు. తొండ ముదిరి ఊసరవెల్లులైనట్లు స్మగ్లర్లు తమ వ్యాపార పరిధిని పెంచారు. మరోవైపు అటవీశాఖ అధికారుల దాడులు, కేసుల భయంతో స్థానిక కూలీలు ఎర్రచందనం నరికేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానిక స్మగ్లర్లకు తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తోడయ్యారు. తమిళనాడులోని పలు జిల్లాల నుంచి వందలాది మంది కూలీలను వెలుగొండల్లోకి డంప్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి చెందిన పెద్దలు గతంలో గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరులుగా వ్యవహరించినట్లు సమాచారం. దట్టమైన అడవుల్లో సునాయాసంగా తిరిగే అలవాటున్న వీరిని ప్రస్తుతం స్మగ్లర్లు జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్లలోనూ పలువురు వీరప్పన్ వారసుల అనుచరులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై గతంలో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించి గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం వెలుగొండల్లో కూంబింగ్ నిర్వహించింది. ఆ సమయంలో స్మగ్లర్లు, కూలీలు దొరక్కపోయినా వారికి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. ఇప్పుడు కూడా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు, కూలీలు జిల్లాలోని వెలుగొండల్లో తిష్టవేసినట్లు తెలుస్తోంది. వారు భారీ ఎత్తున ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జిల్లాలో తరచూ భారీఎత్తున దుంగలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు తనిఖీల్లో వెలుగుజూస్తోంది. ఈ క్రమంలో ఆదిశగా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు దొరికిన స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారించారు. సూళ్లూరుపేటలో దొరికిన కూలీలు, స్మగ్లర్లను విచారణ అనంతరం బుధవారం వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఆత్మకూరు : తమిళనాడుకు చెందిన కూలీలు పెద్దసంఖ్యలో చిక్కిన నేపథ్యంలో ఆత్మకూరు రేంజ్‌లోని అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రేంజ్ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం చెక్‌పోస్టు వద్ద రెండు వాహనాలు, మర్రిపాడు మండలం వెంకటాపురం బీట్పరిధిలో ఓ వాహనంతో పాటు వాటిలోని 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ఆరంబాకంకు చెందిన సయ్యద్, రాజాతో పాటు నెల్లూరుకు చెందిన వేణు, మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేంజర్ నాగరాజు కథనం మేరకు..మర్రిపాడు మండలం కంపసముద్రం మీదుగా క్వాలీస్‌లో దుంగలు వస్తున్నాయని కృష్ణాపురం చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం అందింది. వారు అప్రమత్తం కావడంతో స్మగ్లర్లు క్యాలిస్ను వదిలి ఉడాయించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు పాళెం చెక్‌పోస్టు వద్ద టాటా మ్యాజిక్ ఆటోలో వాటర్ప్యాకెట్ల మధ్య తరలిస్తున్న దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆటోకు పెలైట్‌గా వ్యవహరిస్తున్న ఇండికా కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో సయ్యద్, రాజా చిక్కగా, పెలైట్ వాహనంలో వేణు, మహేష్ దొరికారు. నెల్లూరుకు చెందిన మురళీ, ప్రభాకర్ ఆదేశాల మేరకు దుంగలను తీసుకెళుతున్నట్లు వారు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తమిళనాడులోని రెడ్‌హిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి సయ్యద్, రాజాలను పంపినట్లు తేలింది.తనిఖీల్లో డీఆర్వోలు మోహన్‌రావు, గాలిబ్, ఎఫ్‌బీవో లక్ష్మీసాగర్, చెక్‌పోస్టు సిబ్బంది తిరుపాలు, పండరినాథ్, ఓంప్రకాష్, నరసింహులు పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు వల ఎర్రచందనం రవాణాకు పెలైట్లుగా కొందరు ఆటోడ్రైవర్లను స్మగ్లర్లు వినియోగించుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోడ్రైవర్లకు పల్లెల్లోని మార్గాలపై అవగాహన ఉండటంతో వారిని ఈ మొగ్గులోకి దించుతున్నట్లు సమాచారం. పెలైట్‌గా వ్యవహరిస్తూ మంగళవారం అర్ధరాత్రి నెల్లూరుపాళెం చెక్‌పోస్టు వద్ద దొరికిన వేణు ఆటోడ్రైవర్ కావడం గమనార్హం. అటవీప్రాంతం నుంచి నెల్లూరుకు ఎర్రచందనాన్ని చేర్చితే పెలైట్‌గా వ్యవహరించే వారికి రూ.2500 నుంచి రూ.3000 వరకు ఇస్తారని తెలిసింది.