breaking news
Veera babu
-
మౌన ప్రేమ
రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘మనసు పలికే మౌన ప్రేమ’. నందు, ప్రియ, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్ బాబు ముఖ్య తారలుగా బాబీ వేంపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏఎస్పీ ప్రొడక్షన్స్ పతాకంపై బొట్రేపల్లి ఆవులకుంట్ల సూర్యప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, కె.ఎస్. నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘1980లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ సినిమాకి కథ నేనే అందించా. స్టోరీ చెప్పినప్పుడు నా స్నేహితుడు బాబీ ఎగ్జయిట్ అయ్యి దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయి. జనవరి 18న రెగ్యులర్ షూట్ ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్ లవ్ స్టోరీతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూర్యగారు స్టోరీ బాగా రాశారు. నాపై తను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు బాబీ. ‘‘టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది’’ అని హీరో నందు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కుమారన్. -
కోరుమిల్లిలో పోలీసుల దాష్టీకం
-
కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను..
లెక్కించలేనన్ని వన్నెలను ప్రకృతిలో పొదిగిన విధి అతడికి ఒక్కగానొక్క వన్నె కూడా తెలియకుండా చేసింది. అయితేనేం.. ‘నీ జీవితాన్ని ఏడువన్నెల ఇంద్రధనువుగా మార్చడానికి నేనున్నాను. నీకు తెలియని రంగుల్ని నా స్పర్శగా, ప్రేమగా అనువదించి అందిస్తా’నంది ఓ యువతి. ‘చూపు లేని నీ బతుకునావకు చుక్కానిని అవుతాను’ అన్న ఆ యువతి వేలికి ఉంగరం తొడిగే వేళ అతడు.. ఇన్నాళ్లూ తనను చిన్నచూపు చూసిన విధినే చిన్నబుచ్చినంత పరమానందభరితుడయ్యాడు. పుట్టంధుడైన వేల్పూరి రవిబాబు, స్వరూపరాణిల కులాంతర వివాహం శనివారం తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో జరిగింది. వెదురుపాకకు చెందిన వీరబాబు పుట్టుకతోనే అంధుడు. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తల్లి మంగ, తండ్రి వెంకన్న అనారోగ్యంతో మృతిచెందారు. కంటిచూపు లేదని, కన్నవారు లేరని అతడు కుంగిపోలేదు. మండపేటలోని ప్రత్యేక అంధుల పాఠశాలలో చేరాడు. మొక్కవోని సంకల్పంతో డిగ్రీ, డీఈడీ చదివిన వీరబాబు 2012 డిసెంబర్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రస్తుతం కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఎంపీయూపీ పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా సమిశ్రగూడెంకు చెందిన స్వరూపరాణి డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి ఆశ వర్కర్ కాగా తండ్రి చిరుద్యోగి. కులాలు వేరైనా వీరబాబు, స్వరూపరాణిల వివాహం చేయడానికి పెద్దలు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన స్వరూపరాణి ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవయ్యా...అందుకే నా కన్నులతో లోకం చూడయ్యా’ అంటూ వీరబాబు జీవితంలో ప్రవేశించింది. అంధుల పాఠశాలలో వీరబాబు సహాధ్యాయులు, అతడి గురువులు వివాహానికి హాజరయ్యారు. వీరబాబు సహాధ్యాయులు తమకు కళ్లులేక పోయినా.. ఆనందకాంతులు నిండిన ముఖాలతో నవదంపతులను ఆశీర్వదిస్తుంటే చూసేవారి కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. ఎంతోమంది స్నేహహస్తం అందించారు.. నేను చదువుకునే సమయంలో మండపేట ప్రత్యేక అంధుల పాఠశాల యాజమాన్యంతో పాటు స్నేహితులు సహకరించారు. నేను చదవడానికి ఆర్థికంగా స్నేహితులు చేసిన సహాయం, అందించిన ప్రోత్సాహం మరువలేనిది. - వేల్పూరి వీరబాబు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాను.. మనిషికి దేవుడిచ్చిన వరం ఈ ప్రకృతి. దానిని చూడలేని వీరబాబుకు నా కళ్లతో ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. అతడిని నా కళ్లలో పెట్టుకుని చూసుకుంటాను. - స్వరూపరాణి