175 అడుగుల హనుమాన్ విగ్రహం వద్ద వరలక్ష్మీ పూజలు
శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్ : నరసన్నపేట మండలం మడపాం వద్ద నిర్మాణంలో ఉన్న 175 అడుగుల హనుమాన్ విగ్రహం వద్ద రామభక్త హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు ప్రధాన ఆదినారాయణ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలనుకుంటున్నామని చెప్పారు.
నిర్మాణం పూర్తయితే అతిపెద్ద విగ్రహంగా చరిత్రకెక్కుతుందని చెప్పారు. మిగిలిన పని పూర్తి చేసేందుకు నిధుల కొరత ఉందని అన్నారు. ఇంకా రూ.30 లక్షల వరకు అవసరమని మరో సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. భక్తుడు కోణార్క్ శ్రీను స్పందిస్తూ స్వామివారికి కిరీటం చేయించేందుకు ముందుకువచ్చారు.
ముఖ నిర్మాణానికి ఆర్థిక సహా యం చేస్తానని యార్లగడ్డ గీత ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టంకాల బాబ్జీ, గోపాల కృష్ణ, యోగా రామారావు, డాక్టర్ పద్మా రామారావు తదితరులు పాల్గొన్నారు.