breaking news
Var
-
ఫ్రాన్స్ బోణీ చేసింది
కజన్: ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్), ఫ్రాన్స్ ఖాతా తెరిచాయి. గ్రూప్ ‘సి’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు టెక్నాలజీ బాగా సాయం చేసింది. గోల్ అయిన రెండుసార్లూ టెక్నాలజీదే పాత్ర. దీంతో ‘యూరో’ రన్నరప్ 2–1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. యువ సైన్యంతో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఫ్రాన్స్ స్థాయికి తగిన ఆటతీరుతో బోణీ కొట్టింది. తొలిసారిగా ఈ ప్రపంచకప్‌లో ప్రవేశపెట్టిన వీఏఆర్ పద్ధతిలో గోల్ కొట్టిన ఆటగాడిగా ఆంటోనీ గ్రీజ్మన్ రికార్డులకెక్కాడు. 2016 యూరో కప్‌లో అదరగొట్టిన ఈ అట్లెటికో మాడ్రిడ్ స్టార్‌ను ద్వితీయార్థంలో పెనాల్టీ బాక్స్ వద్ద ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ రిష్డన్ తప్పుగా అడ్డుకున్నాడు. మొదట రిఫరీ అండ్రెస్ కున్హా పెనాల్టీ కిక్ ఇచ్చేందుకు తిరస్కరించాడు. దీంతో ఫ్రాన్స్ అప్పీల్‌కు వెళ్లడంతో వీఏఆర్ ఫుటేజ్‌ను పరిశీలించి పెనాల్టీ కిక్ ఇచ్చాడు. ఆట 58వ నిమిషంలో ఎలాంటి పొరపాటు చేయకుండా గ్రీజ్మన్ గోల్ చేయడంతో తొలి వీఏఆర్ గోల్ నమోదైంది. 1–0తో ఫ్రాన్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆనందం కాసేపటికే ఆవిరైంది. నాలుగు నిమిషాలకే ఆస్ట్రేలియాకు లభించిన పెనాల్టీని జెడినాక్ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. ఈ దశలో ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డాయి. గోల్‌పోస్ట్‌పై దాడులకు పదునుపెట్టాయి. ఈ క్రమంలో ఆట 81వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పోగ్బా ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈసారి ‘గోల్ లైన్ టెక్నాలజీ’ని పరిశీలించారు. క్రాస్‌బార్‌ను దాటిన బంతి బౌన్స్ అయ్యాక గోల్ లైన్‌ను తగిలిందా లేదా అని నిర్దారించేందుకు టెక్నాలజీని వాడారు. వీఏఆర్ కథేంటి... సాకర్ ప్రపంచకప్ది సుదీర్ఘ చరిత్రే. అయితే టెక్నాలజీని మాత్రం మితిమీరి వినియోగించదు ఫిఫా. మైదానంలో రిఫరీ చెప్పిందే వేదం. ఫీల్డ్‌లో ఆటగాళ్లు పెనాల్టీ బాక్స్‌లకు చేరగానే ప్రత్యర్థి ఆటగాళ్లలో కొందరు సందేహాస్పదంగా అడ్డుకోవడం పరిపాటి. ఇది మైదానంలో ఉన్న రిఫరీ కంటబడితేనే పెనాల్టీ కిక్ ఇస్తాడు. లేదంటే లేదు. దీంతో ఇది చూసిచూడని వ్యవహారం కావడంతో కొందరు అదేపనిగా అనుమానాస్పద టాకిల్స్ (అడ్డుకోవడం) చేస్తుంటారు. ఈ సారి కొత్తగా వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్)ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కీలక తరుణంలో ఫౌల్ టాకిల్స్ (తప్పుగా అడ్డుకోవడం) అని తేలితే ఫీల్డ్ అంపైర్ వీఏఆర్‌ను పరిశీలించిన తర్వాత పెనాల్టీ కిక్ అవకాశం కల్పిస్తాడు. -
వర్షాతిరేకం
జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగు చేసిన మెట్ట పంటలకు ఊపిరి అత్యధికంగా కొత్తగూడెంలో 9.6 సెం.మీ. వర్షపాతం తాలిపేరు తొమ్మిది గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల సాక్షిప్రతినిధి, ఖమ్మం : మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఊపిరి పోసినట్లయింది. నైరుతి రుతుపవనాలు తొలకరితో పలకరించినట్లే పలకరించి.. వెనక్కు తగ్గాయి. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. వేల హెక్టార్లలో ఎండిపోయే దశకు చేరుకున్న పంటలకు ఈ వర్షం జీవం పోసింది. మంగళవారం రాత్రి జిల్లాలోని కొత్తగూడెంలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంతోపాటు తల్లాడ, బోనకల్, ఇల్లెందు, ములకలపల్లి, గార్ల తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తొలకరిలో కురిసిన వర్షాలతో రైతులు ఆనందంతో పంటల సాగు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వరి పంటను 65,337 హెక్టార్లు, మొక్కజొన్నను 13,428 హెక్టార్లు, పెసర 25,624 హెక్టార్లు, కంది 8,935 హెక్టార్లు, సోయాబీన్ 140 హెక్టార్లు, పత్తి 1, 18,472 హెక్టార్లలో సాగు చేశారు. అయితే పంటలు వేసిన తర్వాత సరైన వర్షాలు కురవక పోవడంతో వరి 181 హెక్టార్లలో, పెసర 2,177 హెక్టార్లు, సోయాబీన్ 120 హెక్టార్లలో పంటను నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో 2,478 హెక్టార్లు ఎండిపోగా, మరో 12,611 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. వాటిలో వరి, మొక్కజొన్న, పెసర, కంది, సోయాబీన్, పత్తి పంటలున్నాయి. ఏజెన్సీలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందుల్లో కుంటలు, చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయి. కామేపల్లిలోని బుగ్గవాగు, నిమ్మవాగు, కామేపల్లి పెద్దవాగుల్లోకి నీరు చేరింది. బయ్యారం పెద్ద చెరువు భారీ వర్షానికి అలుగు పోస్తోంది. కొత్తగూడెంలో ముర్రేడువాగులో నీరు ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి 21,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. తాలిపేరుకు భారీ వరద చర్ల: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 25 క్రషర్ గేట్లలో తొమ్మిది గేట్లను మూడు అడుగుల చొప్పున ఎత్తి ఉంచి 21,600 క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని అటవీప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 21,915 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా, 21,600 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి మరింతగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. భారీగా వస్తున్న వరదకు తాలిపేరు వాగు ఉధతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, వరద ఉధతిని దష్టిలో ఉంచుకొని నీటి మట్టాన్ని 73.45 మీటర్ల వద్ద స్థిరంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.