breaking news
van hit train
-
భదోహిలో వ్యాన్ ను ఢీకొన్న రైలు
-
భదోహిలో ఘోర ప్రమాదం
వ్యాన్ ను ఢీకొన్న రైలు ఏడుగురు చిన్నారుల మృతి భదోహి: ఉత్తరప్రదేశ్ లోని భదోహిలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్ ను రైలు ఢీకొననడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాపలేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యాన్ లో 19 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. పలువురు చిన్నారులు కూడా గాయపడినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.