breaking news
Usman Khaza
-
ఖాజా శతక జోరు
తొలి మూడు టెస్టులకు భిన్నంగా చివరి నాలుగో టెస్టు మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన జట్టు మొదటి రోజే ఆలౌట్ కాకపోవడం విశేషమైతే... ఒక బ్యాటర్ తొలి రోజే సెంచరీ సాధించడం మరో విశేషం. స్పిన్ పిచ్‌లపై చేతులెత్తేసిన బ్యాటర్లను చూసిన ఈ టెస్టు సిరీస్‌లో తొలిసారి బౌలర్లు కష్టపడ్డారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆఖరి టెస్టు పరుగుల మజా అందించనుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా అజేయ సెంచరీతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజును సంతృప్తికరంగా ముగించింది. అహ్మదాబాద్: తొలిరోజు ఆలౌట్. మూడో రోజుకల్లా ముగింపు! ఆ్రస్టేలియా ఆడినా... భారత్ ఇన్నింగ్స్ ఓపెన్ చేసినా... ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఇది షరామామూలే! కానీ ఆఖరి టెస్టు అలా మొదలవలేదు. మొతెరా వికెట్ బ్యాటర్లకు అవకాశమిచ్చింది. ఆలౌట్ కాదుకదా... కనీసం సగం వికెట్లు (5) అయినా ఆతిథ్య భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు. ఇదే మరో నాలుగు రోజులు కొనసాగితే ఈ టెస్టు ఐదు రోజుల పాటు జరగడం ఖాయం! నాలుగో టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలిరోజు ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (251 బంతుల్లో 104 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. భారత పేసర్ షమీ 2 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు అశి్వన్, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. ఆట నిలిచే సమయానికి ఖాజాతో పాటు కామెరాన్ గ్రీన్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ల శుభారంభం ఆ్రస్టేలియా ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (44 బంతుల్లో 32; 7 ఫోర్లు), ఖాజా బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై యథేచ్చగా బ్యాటింగ్ చేశారు. అనుభవజ్ఞులైన పేసర్లలో షమీ రివర్స్ స్వింగ్‌తో వైవిధ్యం కనబరిస్తే... ఉమేశ్ యాదవ్ నిరాశపరిచాడు. ఇతని బౌలింగ్‌లో హెడ్ వన్డేను తలపించే ఆట ఆడాడు. హెడ్ కొట్టిన 7 ఫోర్లలో అరడజను ఉమేశ్ బౌలింగ్‌లోనే బాదాడు. అయితే అంతకు ముందు ఉమేశ్ బౌలింగ్‌లోనే హెడ్ 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ భరత్ సులువైన క్యాచ్ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. తొలి వికెట్‌కు 61 పరుగులు జతయ్యాక హెడ్‌ను అవుట్ చేసిన అశ్విన్ ఓపెనింగ్ జోడీకి ముగింపు పలికాడు. తర్వాత లబుషేన్ (3)ను చక్కని డెలివరీతో షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ స్మిత్ క్రీజులోకి రాగా... 75/2 స్కోరు వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లారు. అనంతరం రెండో సెషనైతే బౌలర్లకు ఏమాత్రం కలిసి రాలేదు. ఖాజా, స్మిత్ ఆతిథ్య బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆట కొన సాగించారు. ఖాజా అజేయ శతకం మూడో వికెట్‌కు ఖాజా–స్మిత్ జోడీ అజేయంగా సాగడంతో వికెట్ పడకుండానే 149/2 స్కోరువద్ద రెండో సెషన్ ముగిసింది. వికెట్లు టపటపా రాలిన ఈ సిరీస్‌లో ఒక్క వికెట్ అయినా పడకుండా సెషన్ ముగియడం ఇదే తొలిసారి! అయితే ఆఖరి సెషన్ మొదలవగానే స్మిత్ (38; 3 ఫోర్లు) వికెట్‌ను జడేజా పడగొట్టడంతో 79 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి హ్యాండ్స్కాంబ్ (17)ను షమీ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కామెరాన్ గ్రీన్ చూడచక్కని బౌండరీలతో స్కోరు బోర్డును పరుగుపెట్టించాడు. అతని అండతో ఖాజా టెస్టుల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి 9 ఓవర్లలో ఆసీస్ వేగంగా పరుగులు సాధించడంతో 54 పరుగులు వచ్చాయి. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. మైదానంలో ప్రధానమంత్రులు తొలి రోజు ఆటలో భారత్, ఆ్రస్టేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్ ‘75 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రూ క్రికెట్’ అంటూ ప్రధాన ఆకర్షణగా మారారు. టెస్టు ఆరంభానికి ముందు వీరిద్దరు ప్రత్యేక వాహనంలో మైదానమంతా కలియతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అనంతరం ఇరు ప్రధానులు తమ జట్ల కెప్టెన్లకు ప్రత్యేక ‘క్యాప్’లను అందించగా, వేదికపై నలుగురూ చేతులు కలిపి నిలబడిన దృశ్యం హైలైట్‌గా నిలిచింది. తమ జట్ల ఆటగాళ్లతో కలిసి వీరిద్దరు జాతీయ గీతాలాపన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ను ప్రారంభించిన అనంతరం మాజీ క్రికెటర్లు గావస్కర్, లక్ష్మణ్ తదితరులతో మోదీ సంభాషించారు. ప్రెసిడెంట్స్ బాక్స్‌నుంచి ప్రధానులిద్దరూ కొద్ది సేపు టెస్టు మ్యాచ్ తొలి సెషన్‌ను వీక్షించగా...బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షా జ్ఞాపికలు అందజేశారు. మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. అయితే కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా తొలి రోజు ఆశించిన స్థాయిలో రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరు కాలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 32; ఉస్మాన్ ఖాజా బ్యాటింగ్ 104; లబుషేన్ (బి) షమీ 3; స్మిత్ (బి) జడేజా 38; హ్యాండ్స్కాంబ్ (బి) షమీ 17; గ్రీన్ బ్యాటింగ్ 49; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–61, 2–72, 3–151, 4–170. బౌలింగ్: షమీ 17–2–65–2, ఉమేశ్ 15–2–58–0, అశ్విన్ 25–8–57–1, జడేజా 20–2–49–1, అక్షర్ 12–4–14–0, అయ్యర్ 1–0–2–0. -
లంక ముందు కొండంత లక్ష్యం
కాన్బెర్రా: రెండో టెస్టులో ఆస్ట్రేలియా... శ్రీలంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో శ్రీలంకకు 516 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ ద్వారా ఎట్టకేలకు ఉస్మాన్ ఖాజా (101 నాటౌట్, 14 ఫోర్లు) ఫామ్‌లోకి వచ్చాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 123/3తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టార్క్ (5/54) లంకపై పంజా విసిరాడు. లయన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్‌ను ఖాజా నడిపించాడు. జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన దశలో శ్రీలంకపై అజేయ శతకం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్లు హారిస్ (14), బర్న్స్ (9)లతో పాటు లబ్‌షేన్ (4) విఫలం కాగా... ఖాజా, హెడ్ (59 నాటౌట్; 8 ఫోర్లు) అజేయంగా రాణించారు. ఇద్దరు అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఖాజా సెంచరీ పూర్తవగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. కరుణరత్నే (8 బ్యాటింగ్), తిరిమన్నె (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
సిరాజ్ సంచలనం
బెంగళూరు: పదునైన పేస్‌తో బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలో దిగిన సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు. ఎనిమిది వికెట్లు సాధించి తన ఫస్ట్ క్లస్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. సిరాజ్ ధాటికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (127; 20 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... అతనికి లబ్‌షేన్ (60; 11 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 114 పరుగులు జతచేయడంతో ఆసీస్ కోలుకుంది. వీరిద్దరితో పాటు కుర్టీస్ పీటర్సన్ (31), హెడ్ (4), హ్యాండ్స్కోంబ్ (0), కెప్టెన్ మిచెల్ మార్‡్ష (0), నాసెర్ (0), ట్రైమెన్ (0)లను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. కుల్దీప్ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. -
దక్షిణాఫ్రికా టూర్‌ను బహిష్కరించిన ఆసీస్ ‘ఎ’
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా, ఆ దేశ ఆటగాళ్లకు కొనసాగుతున్న జీతభత్యాల వివాదం మరింతగా ముదిరింది. సీఏ, ఆటగాళ్ల సంఘం (ఏసీఏ) మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం కానరాలేదు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు దూరంగా ఉండనుందని ఏసీఏ ప్రకటించింది. అనధికారిక టెస్టులు, ముక్కోణపు వన్డే టోర్నీలో పాల్గొనేందుకు ఆసీస్ ‘ఎ’ జట్టు ఈనెల 12న సఫారీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఉస్మాన్ ఖాజా కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో మ్యాక్స్‌వెల్, బర్డ్‌లాంటి సీనియర్ టీమ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్, భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లకు సీనియర్ జట్టు వెళ్లేది కూడా అనుమానంగానే మారింది.