breaking news
upper hand girls
-
సీనియర్ ఇంటర్‌లోనూ బాలికలే టాప్
రాష్ట్రంలో ‘అనంత’కు 10వ స్థానం జిల్లాలో గతేడాదికంటే ఒక శాతం పెరిగిన ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్ : సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే హవా కొనసాగించారు. ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. మన జిల్లాలో గత ఏడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 65 శాతం కాగా, ఈ ఏడాది 66 శాతం నమోదైంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో మన జిల్లా 9వ స్థానం సాధించగా, ఈసారి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 10వస్థానం దక్కించుకోవడం విశేషం. జిల్లాలో మొత్తం 24,976 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 16,513 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 12,501 మంది బాలురకు 7808 మంది 52 శాతం, 12,475 మంది బాలికలకు గాను 8,705 మంది 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో గతేడాదికంటే తగ్గిన ఉత్తీర్ణత జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 61.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. అంటే ఈ ఏడాది 1.28 శాతం తగ్గింది. ఈసారి 5362 మంది విద్యార్థులు రాయగా 3204 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి 5764 మందికి గాను 1773 (31 శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 3478 మంది బాలురకు గాను 972 మంది (28 శాతం), 2286 మంది బాలికలకు గాను 801 మంది (35 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి 1848 మంది విద్యార్థులకు గాను 1130 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 983 మంది బాలురకు గాను 538 (54.73 శాతం) మంది, 867 మంది బాలిలకు గాను 592 (68.44 శాతం) మంది పాస్ అయ్యారు. ఒకేషన్లో 3 శాతం పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో గతేడాది కంటే ఈసారి 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. జిల్లాలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1730 మంది విద్యార్థులకు గాను 1264 మంది విద్యార్థులు 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1161 మంది బాలురకు గాను 825 (71 శాతం) మంది, 569 మంది బాలికలకు గాను 439 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది సీనియర్ఇంటర్ ఫలితాల్లో ఒకేషన్ విద్యార్థులు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. నెట్ సెంటర్ల వద్ద హంగామా! ఫలితాల ప్రకటించగానే అనంతపురం నగరంతో పాటు ప్రధాన కేంద్రాలు, మండలాల్లోని నెట్ కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి బంధువులు హంగామా చేశారు. ఫలితాలు, వచ్చిన మార్కులు తెలుసుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద హడావిడి చేశారు. -
ఇంటర్‌లోనూ లాస్ట్ నుంచి ఫస్ట్
► గత ఏడాది కంటే 5 శాతం తగ్గిన ఫలితాలు ► ఒకేషనల్ విభాగంలో 3వ స్థానం ► ఉత్తీర్ణులైన వారిలో బాలికలదే పై చేయి ► ఎంఈసీలో జిల్లా టాపర్ శ్రీ మేధా‘వి’ విద్యార్థిని నాగసాయి తేజ ► ఎంపీసీలో జిల్లా టాపర్ ప్రొద్దుటూరు అభ్యాస్ విద్యార్థి శరత్‌కుమార్ ► బైపీసీలో జిల్లా టాపర్ రాజు విద్యాసంస్థల విద్యార్థిని చందన కడప ఎడ్యుకేషన్/వైవీయూ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 65 శాతం ఫలితాలు సాధించగా, ఈ యేడాది ఐదు శాతం ఫలితాలు కోల్పోయి 60 శాతంతో సరిపెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 19,413 మందికి గాను 11,732 మంది ఉత్తీర్ణత (60శాతం) సాధించారు. బాలుర విభాగంలో 9,747 మందికి గాను 5,328 మంది (55 శాతం) , బాలికల విభాగంలో 9,666 మందికి గాను 6,404 మంది (66 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలదే పైచేయిగా నిలిచింది. ఒకేషనల్ విభాగంలో 649 మందికి గాను 502 మంది (77 శాతం) ఉత్తీర్ణత సాధించి రాష్ర్టంలో 3వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 418 మందికి గాను 310 మంది, (74 శాతం), బాలికల విభాగంలో 231 మందికి గాను 192 మంది (83 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 2,919 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1,910 మంది (65.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 1,068 మందికి గాను 681 మంది (63.76 శాతం), బాలికల విభాగంలో 1,851 మందికి గాను 1,229 మంది (66.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరబల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.53 శాతం, రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 87.88 , పెనగలూరు 87.50 శాతం ఫలితాలతో అగ్ర స్థానంలో నిలిచాయి. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల 48.41 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఎయిడెడ్ కళాశాలల్లో 2,975 మందికి గాను 1,330 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలుర విభాగంలో 1,769 మందికి 650 మంది (36.74 శాతం), బాలికల విభాగంలో 1,206కు గాను 680 మంది (56.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలల్లో లక్కిరెడ్డిపల్లి శ్రీవెంకటేశ్వర ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 92.63 శాతం, కడప సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల 70.10 శాతం, ప్రొద్దుటూరు డీఏడబ్లు కళాశాల 69.33 శాతం ఫలితాలు సాధించాయి. పుల్లారెడ్డిపేట ఎయిడెడ్ జూనియర్ కళాశాల 0.94 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. తొండూరు గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించారు. టాపర్లుగా జిల్లా విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో రాయచోటి రాజు విద్యా సంస్థల విద్యార్థిని కె. చందన బైపీసీ విభాగంలో 987 మార్కులతో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. అదే కళాశాలకు చెందిన రెహమాన్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లాలో రెండవ స్థానంలో నిలిచాడు. ప్రొద్దుటూరు అభ్యాస్ కళాశాలకు చెందిన విద్యార్థి పీవీ శరత్‌కుమార్ రెడ్డి ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. బైపీసీ విభాగంలో శ్రీలక్ష్మి 983 మార్కులు సాధించింది. ఎంఈసీ విభాగంలో నగరానికి చెందిన శ్రీమేధా‘వి’ కళాశాల విద్యార్థిని సి. నాగసాయి చైతన్య 977 మార్కులతో జిల్లా ఫస్ట్‌గా నిలిచింది. ఈమెతో పాటు తేజశ్విని ఎంఈసీలో 975 మార్కులు సాధించింది.ఎంపీసీ విభాగంలో కడప నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన పి. చంద్రశేఖర్ 985 మార్కులు, వెంకట రూప 984 మార్కులు సాధించారు. ైబైపీసీలో ఎం. నర్మదరెడ్డి 979 మార్కులు, సాయిసింధు 976 మార్కులు సాధించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు సైతం మంచి ఫలితాలు సాధించారు. శరత్కుమార్రెడ్డికి అభినందన ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన పీవీ శరత్‌కుమార్‌రెడ్డిని ప్రొద్దుటూరులోని అభ్యాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బచ్చల వీరప్రతాప్, ప్రిన్సిపాల్ ఎన్.జగదీశ్వరరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. కొండాపురం మండలానికి చెందిన విద్యార్థి తండ్రి ప్రతాప్‌రెడ్డి ఆర్టీపీపీలో డోజర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి శివతులశమ్మ గృహిణి. శరత్‌కుమార్ 10వ తరగతి వరకు ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివి 9.5 జీపీఏ సాధించాడు. -
‘సప్లిమెంటరీ’లో బాలికలదే పైచేయి
ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 6,47,468 మంది హాజరు కాగా, 4,49,955 మంది (69.49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,26,352 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. బాలికల ఉత్తీర్ణత 72.51శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 66.87 శాతంగా నమోదైంది. రాష్ట్రాలవారీగా చూస్తే.. తెలంగాణలో 65.82 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 72.73 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, నిజామాబాద్ 57 శాతంతో చివరన ఉంది. ప్రభుత్వ కళాశాలల పరంగా ఆదిలాబాద్ 73 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ 46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఒకేషనల్ పరీక్షలకు 22,146 మంది హాజరు కాగా, 12,480 మంది (56.35 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 60.83 శాతం కాగా, బాలురు 54.24 శాతం మంది పాసయ్యారు. రీకౌంటింగ్ దరఖాస్తుకు 8 వరకు గడువు.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలపై రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఉత్తీర్ణులైన వారికి మార్కుల మెమోలు ఈ నెల 8లోగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందేలా ఏర్పాట్లు చేశారు.