breaking news
University of Westminster
-
పీకలు తెగ్గోసే జిహాదీ జాన్ బతికేఉన్నాడా?!
లండన్: కోడిని కోసినదానికంటే సులువుగా, అత్యంత కర్కషంగా మనుషుల పీకలు కోసి, ఆ భయానక దృశ్యాలను వీడియోతీసి ప్రపంచాన్ని గడగడలాడించిన ఐఎస్ ఉగ్రవాది జిహాదీ జాన్ ఇంకా బతికే ఉన్నాడా? అమెరికా వైమానిక దళం ప్రకటించినట్లు డ్రోన్ దాడుల్లో జాన్ చనిపోలేదా? ఉగ్రపీడిత దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న ఈ వార్తలను ప్రఖ్యాత బీబీసీ ప్రసారం చేసింది. తమ దర్యాప్తులో జిహాదీ జాన్ చనిపోయినట్లు ఆధారాలేవీ లభించలేదని సదరు వార్తా సంస్థ చెబుతోంది. (చదవండి: పీకలు కోసిన జిహాదీ జాన్ ఎవరో తెలుసా...!) బ్రిటన్ జాతీయుడైన మొహమ్మద్ ఎంవాజి.. 2006-2009 మధ్యకాలంలో లండన్ లోని వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివాడు. ఆ తర్వాత కువైట్ లోని ఓ ఐటీ కంపెనీకి సేల్స్ మ్యాన్ గా పనిచేశాడు. ఎప్పుడు చేరాడో సరిగ్గా తెలియరాలేదుకాని కువైట్ నుంచి నేరుగా సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడు. 2014లో ఇతని పేరు ప్రపంచమంతా మారుమోయిపోయింది. బ్రిటన్, జపాన్ లకు చెందిన జర్నలిస్టులతోపాటు చాలా మందిని పీకలుకోసి చంపాడు. అయితే సిరియా సైన్యంతో కలిసి అమెరికా వైమానిక దళం జరిపిన డ్రోన్ దాడుల్లో 2015, నవంబర్ 15న జిహాదీ జాన్ హతమైనట్లు వార్తలు వినవచ్చాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్సే కాక ఐఎస్ కూడా అతని మరణాన్ని ధృవీకరించాయి. (చదవండి: 'అవును.. జిహాద్ జాన్‌ను చంపేశారు') తాజా వివాదం తెరపైకి వచ్చిందిలా.. మొమమ్మద్ ఎంవాజి అలియాస్ జిహాదీ జన్ కు సంబంధించిన వివరాలు కావాలని బీబీసీ వార్తా సంస్థ ప్రతినిధులు వెస్ట్ మినిస్టర్స్ యూనివర్సిటీని అడగటంతో తాజా వివాదం తెరపైకి వచ్చింది. ఎంవాజికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇవ్వలేమని, అతడు మరణించినట్లుగానీ, అందుకు సంబంధించిన ఆధారాలుగానీ లేనందున జిహాది జాన్ బతికే ఉన్నట్లు భావిస్తామని, అందుకే అతడి చిరునామా సహా ఇతర వివరాలు చెప్పలేమని వర్సిటీ అధికారులు చెప్పిట్లు బీబీసీ కథనంలో పేర్కొన్నారు. బ్రిటన్ ఇన్షర్మేషన్ కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించగా, వర్సిటీ నిబంధనలను సమర్థించినట్లు బీబీసీ తెలిపింది. అంటే..చనిపోయిన జిహాదీ జాన్ వెస్ట్ మినిస్టర్స్ వర్సిటీ లెక్క ప్రకారం బతికున్నట్లే! (చదవండి: జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు) -
స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం
లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్‌కు ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమలు, విద్య తదితర రంగాలకు పాల్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్వరాజ్‌పాల్ తరఫున ఆయన కుమార్తె అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాల్ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు.