breaking news
University of Sussex
-
మనసును పట్టే కంప్యూటర్
లండన్: మనమెపుడైనా బోర్గా ఫీల్ అవుతుంటే మనవాళ్లు ఏమయింది అని ప్రశ్నిస్తుంటారు కదా! మరి అదే పనిని కంప్యూటర్లు చేస్తే? మానవులు బోర్గా ఉంటే మన కంప్యూటర్లు ఇట్టే పట్టేస్తాయట! దీన్ని ససెక్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హ్యారీ విచెల్ ధ్రువీకరించారు. మనిషి ప్రదర్శించే చిన్న హావభావాలను కంప్యూటర్ ద్వారా కొలిచే కొత్త విధానాన్ని ఆయన రూపొందించారు. ఒక వ్యక్తి ఆసక్తిని కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా గణించవచ్చని హ్యారీ తెలిపారు. ఈ ప్రయోగానికి 27 మంది పార్టిసిపెంట్ల ముఖ కదలికలను మూడు నిమిషాల కంప్యూటర్ సెసన్స్ ద్వారా గుర్తించినట్లు వివరించారు. అదే సమయంలో వారి కదలికలను గుర్తించడానికి వీడియో మోషన్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు. ఈ రెండు చర్యల ద్వారా 42 శాతం మంది తమ పనిలో బోర్ను ఫీల్ అవుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. -
కాఫీటీగలయ్యాయి..
సమ్థింగ్ స్పెషల్ కేవలం మనుషులు మాత్రమే కాఫీ అంటే పడి చచ్చిపోతారన్నది మీ అభిప్రాయమా? అయితే మరోసారి బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటారా? ఇటీవల లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ విద్యార్థులు ఓ పరిశోధన చేశారు. అది మనుషులపైన కాదు.. తేనెటీగలపైన.. ఆ విద్యార్థులు చివరికి ఓ వింత్తై విషయాన్ని తేల్చారు. అదేమిటంటే కాఫీ ప్రియుల సంఖ్యలో తేనెటీగలు కూడా చేరాయట. సారీ..సారీ.. ఇప్పుడు వాటిని కాఫీటీగలనాలేమో.. ఎందుకంటే అవి కాఫీ కోసం తెగ తంటాలు పడుతున్నాయట. పరిశోధన సమయంలో ఎన్నో తేనెటీగలు తమ ఆహారం గురించి 4-5 గంటల పాటు కాఫీ మొక్కలను వెతకడం చూసి ఆశ్చర్యపోయారట విద్యార్థులు. ఆకలితో ఆపసోపాలుపడుతున్నా, తేనెనందించే పూలు ఎదురుగా ఉన్నా అవి కాఫీ రుచి కోసం వెతుకుతున్నాయంటే వాటికి అది ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ దీని కారణంగా మిగతా మొక్కలకు పెద్ద హానే జరుగుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగల ద్వారా పాలినేషన్ జరుగుతుండటం సహజం. కానీ ఇప్పుడు కాఫీ తాగుతున్న టీగల కారణంగా మిగతా పూలలో ఉండే మకరందంలోని తియ్యదనం తగ్గుతోందట. ఇంకో విచిత్రం ఏమిటంటే ‘తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు’ కాఫీకి బాగా అలవాటు పడిన టీగలు తన చుట్టు పక్కనున్న తేనెటీగలకు కూడా ఈ కాఫీ రుచిని చూపించి వాటికీ అలవాటు చేస్తున్నాయట.