breaking news
The Union Ministry of Home Affairs
-
ఆధార్ నంబర్ భేష్
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ న్యూఢిల్లీ: ఆధార్‌పై కేంద్ర హోంశాఖ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆధార్ చక్కగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ మేరకు తాజాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఒక వ్యక్తి సమస్త వివరాలను క్రోడీకరించి డాటాబేస్ నిర్వహించడంపై యూపీఏ ప్రభుత్వ హయాంలో హోంశాఖ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆధార్ నమోదుకు ప్రజలు అనేక గుర్తింపు పత్రాలు అందజేయాల్సి రావడంపైనా అభ్యంతరం తెలిపింది. అయితే ఇప్పుడు హోంశాఖ తన వైఖరిపై యూటర్న్ తీసుకోవడం గమనార్హం. ‘ఆధార్ సార్వత్రిక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. నిరుపేదలు బ్యాకింగ్ సేవలు పొందేందుకు దోహదపడుతుంది. ఆధార్‌లో బయోమెట్రిక్ విధానాన్ని మోసాలను అరికట్టవచ్చు. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు, పాస్‌పోర్టు దరఖాస్తుకు, పలుచోట్ల గుర్తింపునకు.. ఇలా ఆధార్ సంఖ్యతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు’ అని పేర్కొంది. -
‘సర్వే’పై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు
టీడీపీ పార్లమెంటరీ నేత సుజనాచౌదరి న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర హోంశాఖ మంత్రికి తమ పార్టీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనాచౌదరి ఖండించారు. గురువారం ఆయన ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎవరికీ ఏ ఫిర్యాదు ఇవ్వలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వే ఎందుకో తెలియజేయాలని కోరామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంది, అనుభవజ్ఞుడైన సీఎం ఉన్నారు. ఆయన ఏది కావాలనుకున్నా చేయొచ్చు. ఏది చేయాలో చేయకూడదో ఆయన నిర్ణయిస్తారు. సర్వేపై తెలంగాణ ప్రజల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు’’ అన్నారు. ఉద్యోగుల విభజనపై మాట్లాడుతూ.. వారి విభజన ఆలస్యం కారణంగా రెండు రాష్ట్రాల్లో పరిపాలనా పరంగా ఎన్నో ఇబ్బం దులు తలెత్తుతున్నాయని, విభజన ఎప్పటికి పూర్తి చేస్తారో కేంద్రం స్పష్టత ఇవ్వాలనే విషయం గురువారం పార్లమెంట్లో ప్రస్తావించానన్నారు. ఉద్యోగుల విభజన పారదర్శకంగా చేస్తామని డీఓపీటీ మంత్రి జితేందర్‌సింగ్ సమాధానమిచ్చారని, నిర్దిష్టమైన సమయం తెలియజేయాలని తాను కోరినట్టు చెప్పారు.