breaking news
Union Minister Sujana Chaudhary
-
ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
-
హామీల జల్లు
- ఎడ్యుకేషన్ సిటీగా తాడేపల్లిగూడెం - భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ - నరసాపురంలో పోర్టు అభివృద్ధికి చర్యలు - నిట్ భవనాల శంకుస్థాపన సభలో చంద్రబాబు తాడేపల్లిగూడెం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన జిల్లాపై హామీల జల్లు కురిపించారు. తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఎడ్యుకేషన్ సిటీగా మారుస్తామని.. భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. నరసాపురం పట్టణంలో పోర్టును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన విమానాశ్రయం రన్ వే వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, దశాబ్దాలుగా విమానాశ్రయ భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, శాశ్వత గృహాలు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇక్కడే 50 ఎకరాలలో టౌన్షిప్ ఏర్పాటు చేసి ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 50 ఎకరాలలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సహకారంతో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో నిట్ కోసం సిద్ధం చేసిన 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని, అక్కడ అవసరమైతే మరో 150 ఎకరాలు సేకరించి 400 ఎకరాల భూమిలో ఏదో ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 16 వేల ఎకరాల అటవీ భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నిట్ నుంచి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు బయటకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోనే రికార్డు స్థాయిలో 480 సీట్లతో ఇక్కడి నిట్ ప్రారంభమైందన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరి ధిలో ఏడు జాతీయ విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కావడం అదృష్టమన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ రవాణా రంగంలో విజయవాడ తర్వాత తాడేపల్లిగూడెం పేరు సాధించిందన్నారు. ఇక్కడ ఆటోనగర్ ఏర్పా టు చేయాలని కోరారు. విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు పైపులైన్ ద్వారా తాగునీరు అందించే పథకాన్ని నిర్మించాలని, తాడేపల్లిగూడెంను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. అటవీ భూములను డీనోటిఫై చేసి వెంకట్రామన్నగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని కోరారు. నిట్ తాత్కాలిక తరగతుల కోసం భవనాలు సమకూర్చిన వాసవీ ఇంజి నీరింగ్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత మాట్లాడుతూ జిల్లాను పసుపుమయం చేసి, 15 స్థానాలను అందించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నిట్‌కు రూ.300 కోట్లు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఏపీ నిట్ కోసం రూ.300 కోట్లను కేటాయిస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. నిట్‌లో చదివిన వారంతా వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ రన్ వే సమీపంలో ఏర్పాటు చేసిన నిట్ పైలాన్‌ను సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఎం. వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరి ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రు లు చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు సీఎం రమేష్, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, నిమ్మల రామానాయుడు, బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశె ట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, నిట్ ఏపీ రెసిడెంట్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్, వరంగల్ నిట్ మెంబర్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, మహిళామోర్చా నాయకురాలు శరణాల మాలతీ రాణి, మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, పసల కనకసుందరరావు పాల్గొన్నారు. -
చౌదరికి ఐడియా లేదు..
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘చౌదరి గారు (కేంద్రమంత్రి సుజనా చౌదరి) ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు.. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు.. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే.. నేను ప్రధాని పిలుపుకోసం చూస్తున్నా.. ఆయనతో అన్నీ మాట్లాడుతా’’ అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో ‘కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తీరు, పార్టీల వైఖరి, పార్లమెంటులో ఆమోదం’ అనే అంశాలపై వివరణ పత్రం-2ను సీఎం విడుదల చేశారు. అన్ని పార్టీలూ ఏపీకి ప్రత్యేక హోదాకోసం అడుగుతుంటే కేంద్రమంత్రి సుజనాచౌదరి నెలాఖరులోగా ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని చెప్పిన విషయంపై మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు బదులిస్తూ చౌదరి గారికి ఐడియా లేక అలా మాట్లాడారని బదులిచ్చారేతప్ప.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? లేదా? అన్నవిషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల విభజన చేసినా ఎటువంటి ఇబ్బందులు రాలేదని సీఎం అన్నారు. కానీ యూపీఏ హయాం లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. తమిళనాడు ప్రయోజనాలకోసం అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం, మహారాష్ట్ర ప్రయోజనాలకోసం నాటి హోంమంత్రి షిండే, కొడుకును ప్రధానిని చేయాలని సోనియా విభజన ప్రక్రియకు కొమ్ముకాశారని ఆయన ఆరోపిం చారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంగతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీఎంతో మైక్రోసాఫ్ట్ ఎండీ భేటీ మైక్రోసాఫ్ట్ ఎండీ అనిల్ బన్సారీ శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణకు తోడ్పడాలని సీఎంను కోరారు. రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ హబ్‌లుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ అకాంక్షకు అనుగుణంగా సేవలు అందిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ‘వైట్‌స్పేసెస్’ వినియోగంలోలేని టీవీ స్పెక్ట్రంను ఉపయోగించి తక్కువధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ‘వైట్‌స్పేసెస్’ ప్రాజెక్టును మైక్రోసాఫ్ట్ సంస్థ శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్యులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 18, 19 తేదీల్లో ఢిల్లీ పర్యటన సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాలపై ప్రధానిమోదీతో పాటు పలువురు మంత్రులను కలసి చర్చించడంతో పాటు వినతిపత్రాలను సమర్పించనున్నారు.ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఇటీవలే ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో ధర్నా ద్వారా చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.