breaking news
Understanding of the laws
-
చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యం
ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇది సాధ్యం కామారెడ్డి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ అబ్దుల్ సలీం సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన భీమ్‌గల్(బాల్కొండ) : చట్టాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రజల్లో చైతన్యం రావడం ద్వారానే చట్టాలపై అవగాహన కలుగుతుంద ని సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్, కామారెడ్డి జ్యుడీషియల్ మెజిస్త్రేట్ ఎండీ అబ్దుల్ సలీం అన్నారు. గురువారం ఆయన భీమ్‌గల్‌లోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. చట్టమనేది ఎవరికీ చుట్టం కాదన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వివిధ చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. గృహ హింస, నిర్భయ, వరకట్న వేధింపులు, బాలకార్మిక హక్కు చట్టం, విద్యా హక్కు చట్టాలతో పాటు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం రాకముందు ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు సమాచారం లభించేదికాదన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయ పౌరుడు స్వేచ్ఛగా సమాచారం పొం దే వీలుందన్నారు. దీని ద్వారా అవినీతిని బట్టబయ లు చేయవచ్చన్నారు. ఈ చట్టం వచ్చాకే రూ. 1.86 లక్షల కోట్ల టూజీ స్పెక్ట్రం కుంభకోణం వెలుగుచూసిందన్నా రు. ఢిల్లీలో 2008–09లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ రూ. 86 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు ఈ చట్టం ద్వారానే బయటపడిందన్నారు. ఇలా ఎన్నో అక్రమా లు వెలుగు చూశాయన్నారు. విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా సమాజంలో పేరుకుపోయిన అవినీతిని వెలికితీయవచ్చన్నారు. సమావేశంలో ఆర్టీఐ కామారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్, న్యాయవాది ఏక శ్రీనివాస్‌రావ్, న్యా యవాది టి.లక్ష్మీనర్సింహాచారి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దొనకంటి నర్సయ్య, సర్పంచ్ గుగులోత్ రవినాయక్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గంగేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు ఎంఏ మోయిజ్, బాలకిషన్ పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
మెట్పల్లి మున్సిఫ్ జడ్జి సంతోష్‌కుమార్ గుండంపల్లిలో న్యాయవిజ్ఞాన సదస్సు మల్లాపూర్ (కోరుట్ల) : గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేం దుకే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మెట్పల్లి మున్సిఫ్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ అన్నారు. మండలంలోని గుండంపల్లిలో ఆదివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగినపుడు పౌరులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. పేదలకు ఉచిత న్యాయ సేవలందించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో కోఆర్డినేటర్‌గా ఎలేటి రాంరెడ్డి ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు సేవలందిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్, సర్పంచ్ భూపెల్లి దేవయ్య, ఎంపీటీసీ మార్గం హారీకప్రతాప్, మల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ ఏలేటి రాంరెడ్డి, ఉపసర్పంచ్ జక్కుల అనిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మెహన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకటనర్సయ్య, పుప్పాల భానుమూర్తి, కొండ ప్రవీణ్‌కుమార్, రాజ్‌మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.