ప్రభుత్వ విద్య పనికిరాదా?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సరిగా చెప్పరనే అపవాదు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే చీకటిని నిందిస్తూ కాలం గడప టం కన్నా చిన్న దీపం వెలిగించే ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందని గ్రహించాలి. ఇది తెలియకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తూ వేల రూపాయల ఫీజులు చెల్లి స్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బట్టీ చదువులు తప్ప జ్ఞానవంతమైన విద్యను అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారి కృషి ఫలి తంగానే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధి స్తున్నాయి.
ఈ తరుణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి విద్యాశాఖ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. వేల రూపాయలను గుమ్మరించి విద్యను కొనుక్కునే క్రమంలో తమను తాము దూషించుకుంటూ, ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం కన్నా మన పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందడానికి ప్రభుత్వంపై ఉమ్మడిగా ఒత్తిడి పెంచడమే సరైన పని అవుతుంది. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే జ్ఞాన కేం ద్రాలుగా ప్రభుత్వ విద్యాసంస్థలు ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి.
- జి. అశోక్ గోదూర్, కరీంనగర్ జిల్లా