breaking news
TV viewership
-
IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం
IPL 2021 Created Wonderful Record In TV Viewership: క్రికెట్ అతి పెద్ద పండుగ అయిన ఐపీఎల్లో వీక్షకుల సంఖ్య సీజన్ సీజన్‌కు మిలియన్ల సంఖ్యలో పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తుంది. తాజా సీజన్లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయి 380 మిలియన్లు దాటింది. ఇది 35వ మ్యాచ్ ముగిసే సమయానికి గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 12 మిలియన్లు అధికం. ప్రస్తుత సీజన్లో ప్లే ఆఫ్ బెర్తులు ఇంకా ఖరారు కాక ముందే ఈ స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రధమమని, లీగ్ ముగిసే సమయానికి ఇది 500 మిలియన్ల మార్కును దాటుతుందని లీగ్ బ్రాడ్‌కాస్టర్ ప్టార్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. I am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership📈380 million TV viewers (till match 35)12 million more than 2020 at the same stage🙌🏾Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCI— Jay Shah (@JayShah) September 30, 2021 వీక్షకుల పరంగా అదిరిపోయే రికార్డు సాధించడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం ట్విటర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ టీవీ వీక్షకుల సంఖ్య గత నాలుగు సీజన్లుగా 400 మిలియన్ల మార్కును దాటుతుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ ఏడాది తొలి ఐపీఎల్ మ్యాచ్ టీవీ వీక్షకుల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌ను 323 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. చదవండి: కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు -
కోవిడ్ టైమ్‌లో దేశం ఏం చూసింది?
ముంబై: కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్‌లో టెలివిజన్ వీక్షణ తొమ్మిది శాతం పెరిగినట్టు టీవీ రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) వెల్లడించింది. మొత్తం టీవీ వ్యూయర్షిప్లో న్యూస్ ఛానళ్ల వ్యూయర్షిప్ 27 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పంజాబీ, గుజరాతీ, మళయాళం, తమిళ్, మరాఠీ, హిందీ న్యూస్‌ఛానళ్లకు అత్యధికంగా 10.4 శాతం వ్యూయర్షిప్ నమోదైంది. గత ఏడాది తొలి అర్థ భాగంలోకంటే ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అదే సమయంలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వీక్షణలో మాత్రం రెండు శాతం తగ్గుదల కనిపించింది. వారంలో టీవీ వీక్షించే సమయం ఆధారంగా ఈ శాతాన్ని లెక్కించారు. భారతీయులు ఏం చూశారు? కోవిడ్ కాలంలో భారత ప్రజలు దేన్ని వీక్షించారు ‘వాట్ ఇండియా వాచ్డ్’అనే కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్‌కి ముందు, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అనంతరం, అలాగే 2020 ఏడాది చివర్లో భారతీయుల టీవీ వీక్షణపై ఈ అధ్యయనం చేశారు. ‘ద ఇయర్ ఆఫ్టర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్’అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2020 మార్చి 25న భారత్‌లో లాక్డౌన్ విధించాక ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోయి, టీవీల ద్వారా బాహ్యప్రపంచాన్ని వీక్షించేందుకు ప్రయత్నించారని ఈ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, న్యూస్ ఛానళ్లను ఎక్కువగా వీక్షించినట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే మార్చి– జూన్ కాలంలో టీవీ వీక్షణం 23 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పిల్లల కార్యక్రమాల వీక్షణ 27 శాతం పెరిగింది. 2019తో పోల్చుకుంటే కోవిడ్ కాలంలో 2020లో జనరల్ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ వ్యూయర్షిప్ 9 శాతం పెరిగింది. సినిమా వీక్షణ 10 శాతం పెరిగింది. నాన్ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల వీక్షణశాతం 2019లో 51 శాతం ఉంటే, లాక్డౌన్ కాలంలో (మార్చి 14 నుంచి జూలై 3 వరకు) 2020లో 53 శాతానికి పెరిగింది. టీవీ వీక్షకులు ఒక్క రోజులో టీవీల ముందు గడిపే సమయం 2019లో 3 గంటల 42 నిముషాలు ఉంటే 2020కి వచ్చేసరికి 4 గంటల 2 నిముషాలకు చేరుకుందని సర్వే వెల్లడించింది. లాక్డౌన్ ప్రధాన కారణం 2020లో కోవిడ్‌కి ముందు జనవరి 4 నుంచి మార్చి 13 వరకు టీవీ వ్యూయర్షిప్ ఆరుశాతం తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు,లాక్డౌన్ కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకార్యక్రమాలు నిలిచిపోవడంతో క్రీడాకార్యక్రమాల వీక్షణ తగ్గిపోయింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన టీవీ వీక్షణ క్రమంగా పెరిగింది. 2020 చివరి నెలల్లో మొత్తం టెలివిజన్ వీక్షణ 6 శాతం పెరిగింది. 127 శాతం పెరిగిన ఐపీఎల్ 13 వ్యూయర్షిప్ ఐపీఎల్–13 నేపథ్యంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల వీక్షణలో 127 శాతం పెరుగుదలను నమోదు చేసింది. టీవీ వీక్షకుల్లో అతిపెద్ద క్యాటగిరీ అయిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్(జీఈసీ) వీక్షకులు టీవీ చూసే సమయం 9 శాతం పెరిగింది. సినిమా చూసేవారిలో పదిశాతం పెరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో 27 శాతం పెరుగుదల, సంగీత కార్యక్రమాల వీక్షణ 11 శాతం పెరిగింది. క్రీడల వీక్షించే సమయం –35 శాతం తగ్గినట్టు తేలింది. 2020 తొలి అర్థభాగంతో పోల్చుకుంటే 2020 ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయి. 2020లోని మొత్తం ప్రకటనల్లో టాప్ 10 అడ్వర్టైజింగ్ సెక్టార్లు 80 శాతం ప్రకటనలు ఇచ్చాయి. భారీగా పెరిగిన ప్రభుత్వ ప్రకటనలు.. 2020 పోల్చుకుంటే 2019లో ప్రభుత్వ ప్రకటనలు 184 శాతం(2.7 రెట్లు) పెరిగాయి. ఐపీఎల్–12 తో పోల్చుకుంటే ఐపీఎల్–13 వీక్షకుల శాతం 23 శాతం పెరిగింది. మొత్తం 40,000 కోట్ల నిముషాల పాటు ఐపీఎల్‌ని వీక్షించారు. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌ని అత్యధికంగా 11.2 బిలియన్ల సమయం వీక్షించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్‌ని తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర న్యూస్ చానళ్లకు సంబంధించిన వీక్లీ వ్యూయర్షిప్ డేటాని అక్టోబర్ మధ్య వరకు బీఏఆర్సీ వెల్లడించలేదు. మాజీ ప్రసార నిపుణులు పరితోష్ జోషి మాట్లాడుతూ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. 2019లోనే వార్తా ప్రాధాన్యత కలిగిన ఘటనలు 2019లో ఇదే కాలంలో వార్తా ప్రాధాన్యత కలిగిన అనేక ఘటనలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు, పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ నుంచి తిరిగి రాకలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు వార్తా వీక్షకుల సంఖ్య పెరగడానికీ, 2020లో వార్తా ఛానళ్ళ వీక్షకుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమై ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల శాతం 2019లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం పెరిగినట్టు రిపోర్టు తేల్చింది. 2019తో పోల్చితే వార్తా వీక్షకుల సంఖ్య లాక్డౌన్ కాలంలో 90 శాతం పెరిగితే, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వీక్షకుల సంఖ్య 8 శాతం మాత్రమే పెరిగింది. దూర్దర్శన్ ఛానళ్లలో ప్రసారం అయిన రామాయణ్, మహా భారత్ కార్యక్రమాల కారణంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకులు పెరిగారు. -
ఆస్కార్ ను లైట్ తీసుకున్నారు!
ఈ ఏడాది ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి.. అంటూ హాలీవుడ్ సినీ రంగంలో అద్భుత ప్రతిభ కనబర్చినవారిని సత్కరించే ఆస్కార్ వేడుకలకు.. టీవీల్లో అత్యధికులు వీక్షించే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ గానూ రికార్డుంది. అయితే మూడు రోజుల కిందట జరిగిన 88వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని మాత్రం వీక్షకులు లైట్ తీసుకున్నారు. తిప్పికొడితే ప్రపంచ వ్యాప్తంగా 3.6 కోట్ల మంది మాత్రమే ఆస్కార్ ప్రత్యక్ష ప్రసారాల్ని చూశారు! హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా నిర్వహించిన ఆస్కార్ వేడుకలకు కమెడియన్ క్రిస్ రాక్, నటుడు నీల్ ప్యాట్రిక్ హ్యారిస్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తం కార్యక్రమంలో యాంకర్ క్రిస్ రాక్ తప్ప నామినీలుగా నల్లజాతీయులెవరికీ చోటు దక్కకపోవటమే రేటింగ్స్ దారుణంగా పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. నిజానికి నల్లజాతి నటులకు నామినేషన్లు దక్కకపోవటంపై మొదటి నుంచే వివాదం రగులుతోంది. అదికాస్తా టీవీ ప్రసారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. యూఎస్ లోని ఆ వర్గాలకు చెందిన కొన్ని సంస్థలు అస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించాలని బహిరంగానే పిలుపిచ్చాయి. దీంతో గత ఎనిమిదేళ్లలోనే అతి తక్కువ వ్యూవర్ షిప్ నమోదయింది. ప్రముఖ సర్వే సంస్థ నెల్సన్ ఈ విషయాలను వెల్లడించింది. 2009లో 37.26 మిలియన్ల మంది ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లైవ్ ను టీవీల్లో చూశారు. ఆ కార్యక్రమానికి సంబంధించి అది లోయెస్ట్ వీవర్ షిప్ కాగా ఈ ఏడు అంతకన్నా తక్కువ.. 36.6 మిలియన్ల మంది మాత్రమే చూశారు. అలా చూసిన వారిలోనూ 58 మిలియన్ల మంది ఆరు నిమిషాల్లోపే ఛానెల్ మార్చేశారట!