IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్‌ చరిత్రలో అత్యధికం | IPL 2021 Created Wonderful Record In TV Viewership | Sakshi
Sakshi News home page

IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్‌ చరిత్రలో అత్యధికం

Sep 30 2021 5:16 PM | Updated on Sep 30 2021 5:16 PM

IPL 2021 Created Wonderful Record In TV Viewership - Sakshi

IPL 2021 Created Wonderful Record In TV Viewership: క్రికెట్‌ అతి పెద్ద పండుగ అయిన ఐపీఎల్‌లో వీక్షకుల సంఖ్య సీజన్‌ సీజన్‌కు మిలియన్ల సంఖ్యలో పెరుగుతూ సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తూ వస్తుంది. తాజా సీజన్‌లో ఈ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయి 380 మిలియన్లు దాటింది. ఇది 35వ మ్యాచ్‌ ముగిసే సమయానికి గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 12 మిలియన్లు అధికం. ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్తులు ఇంకా ఖరారు కాక ముందే ఈ స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రధమమని, లీగ్‌ ముగిసే సమయానికి ఇది 500 మిలియన్ల మార్కును దాటుతుందని లీగ్‌ బ్రాడ్‌కాస్టర్‌ ప్టార్‌ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.

వీక్షకుల పరంగా అదిరిపోయే రికార్డు సాధించడం పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం ట్విటర్‌ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ టీవీ వీక్షకుల సంఖ్య గత నాలుగు సీజన్లుగా 400 మిలియన్ల మార్కును దాటుతుంది. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన ఈ ఏడాది తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ టీవీ వీక్షకుల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌ను 323 మిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.  
చదవండి: కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు

Advertisement
 
Advertisement
Advertisement