breaking news
Turtle smuggling
-
ఏడు బస్తాల్లో 1,012 తాబేళ్లు!
వైట్‌ఫీల్డ్ (బెంగళూరు): అంతరించిపోయే స్థితిలో ఉన్న అరుదైన తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తుండగా బెంగళూరు ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. నగరంలోని అత్తిబెలే టోల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో ఏడు బస్తాల్లో తరలిస్తున్న 1,012 తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో రూ. 4 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నగరానికి చెందిన ఓ ఆక్వా దుకాణ యజమాని ఈ తాబేళ్లను హాంకాంగ్‌కు ఎగుమతి చేసేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో 852 నక్షత్ర తాబేళ్లు, 76 కొండ తాబేళ్లు, 46 నోస్ తాబేళ్లు, 11 నోస్ రెడ్ తాబేళ్లు, 27 టెంట్ తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు. వన్యమృగ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. తాబేళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. -
విశాఖలో తాబేళ్ల అక్రమ రవాణా
-
విశాఖలో తాబేళ్ల అక్రమ రవాణా
- నలుగురి అరెస్టు జీకేవీధి: విశాఖ జిల్లా జీకేవీధి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు దాదాపు 250 తాబేళ్లను బస్తాల్లో నింపి ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం తీసుకెళ్తున్నారు. జీకేవీధి మండలం ముల్లుమెట్ట గ్రామం వద్ద అటవీశాఖ అధికారులు బస్సును సోదా చేయగా బస్తాల్లో ఉన్న తాబేళ్లు బయటపడ్డాయి. ఈ మేరకు ఒడిశా వాసులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తాబేళ్లను జలాశయాల్లో వదిలివేస్తామని చెప్పారు.