breaking news
Up Trend
-
పామును చూయింగ్ గమ్‌లా నమిలేశాడు..!
ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు(3) పాముని చూయింగ్ గమ్‌లా నమిలి చంపేశాడు. ఈ ఘటన ఫరూకాబాద్‌లో జరిగింది. బాలుడు తన నానమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆరుబయట ఆడుకుంటుండగా.. పొదలలో నుంచి ఓ పాము అతని వద్దకు వచ్చింది. బాలుడు దాన్ని చేతితో పట్టుకుని నోటితో నమిలేశాడు. ఆ తర్వాత ఆరవడం మొదలుపెట్టాడు. బయటకు వచ్చిన అతని నానమ్మ ఒక్కసారిగా బయపడింది.పామును బాలుని నోటి నుంచి బయటకు లాగి విసిరేసింది. అప్పటికే బాలుడు సృహతప్పి పడిపోయాడు. బాధితుని నానమ్మ బంధువుల సహాయంతో బాలున్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు తక్షణం స్పందించి చికిత్స అందించారు. బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి:బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు.. -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై : స్టాక్ మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు మీదున్న స్టాక్ మార్కెట్లు సోమవారం అదే జోరు కొనసాగించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 39,890 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 12వేల పాయింట్ల దిగువన 11,970 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆటోమొబైల్ మినహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. మే నెలలో వాహన విక్రయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. -
పాజిటివ్ ట్రెండ్‌తో ప్రారంభమైన మార్కెట్లు
సాక్షి, ముంబయి : ఆసియా మార్కెట్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు సానుకూల జోష్‌తో ప్రారంభమయ్యాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్ధాన్ యూనిలివర్ సహా పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటం, రూపాయి బలహీనం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడుతుండగా..టాటా మోటార్స్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ర్టీస్, భారతి ఎయిర్టెల్ నష్టపోతున్నాయి. మరోవైపు హెచ్‌యూఎల్, అదానీ పవర్, మైండ్ ట్రీ, జీ ఎంటర్టెన్మెంట్, డీసీబీ బ్యాంక్, టాటా స్పాంజ్ త్రైమాసిక ఫలితాలను నేడు వెల్లడించనున్నాయి. -
26,250 దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్
మార్కెట్ పంచాంగం ఇయర్ఎండ్ షార్ట్ కవరింగ్‌తో వరుసగా మూడోవారం భారత్ సూచీలు కూడా పెరిగాయి. దాదాపు ప్రతీ ఏడాదీ జనవరి తొలివారంలో భారత్ మార్కెట్ సానుకూలంగా వుంటుంది. కానీ పలు సందర్భాల్లో జనవరి రెండు, మూడోవారాల్లో డౌన్‌ట్రెండ్‌ను ఇన్వెస్టర్లు చవిచూస్తుండేవారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సంవత్సరాంతపు సెలవుల నుంచి తేరుకుని, కొత్త సంవత్సరం రెండోవారం నుంచి చురుగ్గా ట్రేడ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా అదేట్రెండ్ పునరావృత్తమవుతుందా లేదా అనేది అంచనావేయలేముగానీ...ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వుండటం అవసరం. జనవరి తొలివారంలో వెలువడే అమెరికా జాబ్స్ డేటా తదితర కీలక గణాంకాలు రానున్న నెలల్లో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తీసుబోబోయే నిర్ణయాలకు బాట వేస్తాయి. సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు జనవరి 1తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 322 పాయింట్ల లాభంతో 26.161 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే క్రితం వారం వరుసగా నాలుగు రోజులపాటు గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రీతిలో 26,100-26,250 పాయింట్ల నిరోధ శ్రేణి మధ్య అవరోధాన్ని చవిచూసింది. రానున్న రోజుల్లో ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తేనే, తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. 26,250 పాయింట్లపైన 26,567 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అక్టోబర్ 26 నాటి 27,618 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి డిసెంబర్ 14నాటి 24,867 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 26,567 పాయింట్లు. ఈ స్థాయిని దాటితే రానున్న వారాల్లో 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 26,930 పాయింట్ల వద్దకు పెరిగే ఛాన్స్ వుంటుంది ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 25.940 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 25,400 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. 7,980పైన నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగింపు ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 7.963 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీ సైతం 7,940-7,980 పాయింట్ల శ్రేణి మధ్య గతవారం పలుదఫాలు అవరోధం ఎదుర్కొన్నది. ఈ శ్రేణిని బలంగా దాటగలిగితేనే నిఫ్టీ తదుపరి ర్యాలీ సాధ్యపడుతుంది. 7,980 పాయింట్ల పైన నిఫ్టీ వెనువెంటనే 8,036 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఇది గతంలో 8,336 పాయింట్ల నుంచి 7,551 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. అటుపైన ముగిస్తే 75 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 8,140 పాయింట్ల వరకూ నిఫ్టీ పెరగవచ్చు. ఈ వారం నిఫ్టీ 7,980 పాయింట్లపైన స్థిరపడలేకపోతే 7,890 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ లోపున క్రమేపీ 7,830 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 7,730 పాయింట్ల స్థాయి వద్దకు క్షీణించవచ్చు.