breaking news
trees turn canvas
-
సిద్దిపేట.. సింగారం
సిద్దిపేట: రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. నేలంతా పచ్చదనం పరుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అటు నలుపు, ఇటు పచ్చదనం మధ్యన ఎర్రెర్రాని పువ్వులతో సరికొత్తగా సింగారించుకుంది సిద్దిపేట పట్టణం. వేములవాడ కమాన్‌రోడ్, రామగుండం హైవేలో ఈ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఫోటోలు : కే సతీష్, స్టాఫ్ ఫోటోగ్రాఫర్, సిద్దిపేట -
వృక్షమే ఓ వర్ణ చిత్రం
- దేశంలోనే మొదటిసారి నగరంలో చెట్లపై పెయింటింగ్ - సుందరీకరణలో భాగంగా చర్యలు హైదరాబాద్: పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. వాటిపై అందమైన పెయిం టింగ్స్ వేస్తే.. మరింత అద్భుతంగా ఉంటుంది. జిరాఫీ, ఏనుగు, జింకలతో పాటు ఇతర జంతువులు, రంగు రంగుల పక్షుల పెయింటింగ్స్, బతుకమ్మ లాంటి ఉత్సవాల పెయిం టింగ్స్, పిల్లల కోసం గాలిపటాలు, బెలూన్స్ పెయింటింగ్స్... వీటన్నింటికీ వేదిక కానున్నాయి నగరంలోని చెట్లు. భాగ్యనగర సుందరీకరణలో భాగం గా ప్రధాన రహదారుల వెంట జీహెచ్ఎంసీ ఈ పెయింటిం గ్స్ వేసేందుకు శ్రీకారం చుట్టింది. సీఎస్ఆర్లో భాగంగా కంపెనీల సహకారంతో చెట్లకు పెయింటింగ్స్ వేసే ప్రక్రియ శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కార్యాలయం పరిధిలో ప్రారంభ మైంది. బంజారాహిల్స్‌కు చెందిన ‘ఆర్ట్ ఎక్జోటికా’ట్రీ పెయింటింగ్స్ వేస్తోంది. ప్రకృతి వనరుల సంరక్షణ కోసం సామాజికంగా చైతన్య పరిచే నినాదాలు చెట్లపై వేస్తారు. అందంగా చేయడమే లక్ష్యం రాజ్‌భవన్ రోడ్డు, సీఎం పేషీ రోడ్డు, జలగం వెంగళరావు పార్క్ రహదారులను అందంగా తీర్చిదిద్దాం. వెస్ట్ జోనల్ రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు ట్రీ పెయింటింగ్ చేస్తున్నాం. ట్రీ పెయింటింగ్ వేయించేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వెస్ట్ జోనల్ పరిధిలో 26 రోడ్లను అధికారులు దత్తత తీసుకున్నారు. – జోన్ కమిషనర్ హరిచందన దేశంలోనే మొదటిసారి అమెరికా, యూకె లాంటి దేశాల్లో మాత్రమే ట్రీ పెయింటింగ్స్ కనిపిస్తాయి. మన దేశంలో ఎక్కడా కనిపించవు. చెట్లకు చెదలు పట్ట కుండా తెల్ల రంగు మాత్రం వేస్తారు. ఇక్కడ చెట్లను శుభ్రం చేసి పెయింటింగ్స్ వేస్తున్నాం. చెట్ల సంరక్షణతో పాటు అందంగా కనిపించేందుకు ట్రీ పెయింటింగ్ దోహదపడతాయి.– ఆర్ట్ ఎక్జోటికా డైరెక్టర్ సంధ్య