breaking news
trains stalled
-
మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య నిలిచిన పలు రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్-హైదరాబాద్ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంకొండ వద్ద పట్టాలపై ట్రాక్‌మిషన్ ఒరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దేవరకద్ర మండలం కౌకుంట్ల వద్ద గుంటూరు ప్యాసింజర్, దేవరకద్ర వద్ద తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలుగా అవస్థలు పడుతున్నారు. అయితే ట్రాక్‌ను క్లియర్ చేయడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఈ రూట్లో నడిచే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. -
ప్రయాణికులకు నరకం చూపిన ఢిల్లీ మెట్రో
దేశరాజధాని ఢిల్లీలో మెట్రోరైలు ప్రయాణికులకు నరకం చూపించింది. అందులో ఓ సాంకేతిక లోపం తలెత్తడంతో పలు రైళ్లు చాలా ఆలస్యంగా నడచాయి, చాలా సేపటి పాటు కొన్ని స్టేషన్లలో ఆగిపోయాయి. దాంతో వాటిలో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి నోయిడా సిటీ సెంటర్ / వైశాలి ప్రాంతానికి వెళ్లే బ్లూలైనులో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సమస్య తలెత్తింది. నోయిడా నుంచి బయల్దేరిన ఒక రైలు ద్వారకా సెక్టార్ 14 స్టేషన్ వద్ద ఆగిపోయిందని ఢిల్లీ మెట్రో రైలు అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత రైలును పక్కకు తీసుకెళ్లిపోయి సమీపంలోని డిపోలో మరమ్మతులు చేయించామని, అందులో ఉన్న ప్రయాణికులందరినీ దించేశామని చెప్పారు. అయితే, ప్రయాణికులు చెప్పేది మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తాను ఉదయం 9.15 గంటలకు ద్వారకా సెక్టార్ 9 స్టేషన్ వద్ద రైలు ఎక్కానని, అది 10 గంటల వరకు అక్కడే ఉండిపోయిందని, తాను మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆఫీసుకు వెళ్లలేకపోయానని సంగీత అనే ప్రయాణికురాలు చెప్పారు. బ్లూలైన్ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 7 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటారు.