కుక్ & టేస్ట్
నలభీములను ఆదర్శంగా తీసుకున్న మహిళలు.. పాకకళను మరింత పదునుపెడుతున్నారు. నోరూరించే వంటకాల తయారీలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. రొటీన్ ఫుడ్ కాకుండా వెరైటీలను ట్రై చేయుడానికి మేం రెడీగా ఉన్నామంటున్నారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని హోటల్ హయాత్‌లో ‘ఎక్స్పర్ట్ చెఫ్‌తో కుకరీ క్లాసెస్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. హయత్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్ భారతీయ వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు.
ఇండియన్ ఫుడ్ వెరైటీస్ షమ్మీకబాబ్,పరద్దార్ పన్నీర్, దమ్కాముర్గ్, కోఫ్తాకర్రీ, సబ్జ్ పులావ్, దాల్ మఖానీ, కుల్చా, నాన్ రోటీ వంటి వంటకాల తయారీపై ఈ సెషన్లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌కు హాజరైన మగువలు కూడా గరిట పట్టి తవు వంటకాలు రుచి చూపించారు. ఈ కుకరీ క్లాసెస్‌కు విదేశీయుులు కూడా హాజరవడం విశేషం. ఇండియున్ ఫుడ్ టేస్ట్ అదరహో అని కితాబిచ్చారు.
పెరుగుతున్న ఆదరణ
కుకరీ క్లాసెస్‌కు ఆదరణ పెరుగుతోందని హోటల్ హయాత్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్ తెలిపారు. మొదట్లో కుకరీస్ క్లాసెస్‌కు ఒకరిద్దరు వూత్రమే హాజరయ్యేవారని.. ఇప్పుడు వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న ఏషియున్ వంటకాలపై క్లాసెస్ నిర్వహిస్తావుని తెలిపారు.
- హయత్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్
రాయదుర్గం