today news diary
-
టుడే న్యూస్ డైరీ
త్రివేంద్రసింగ్ రావత్ ప్రమాణం నేడు ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్రసింగ్ రావత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. డెహ్రాడూన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా హాజరుకానున్నారు. యూపీ సీఎం ఎంపిక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు తేలిపోనుంది. ఇవాళ సాయంత్రం లక్నోలో జరిగే బీజేఎల్పీ సమావేశానికి వెంకయ్య నాయుడు, భూపేంద్రయాదవ్ పరిశీలకులుగా హాజరుకానున్నారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోజ్ సిన్హా, ఆదిత్యనాథ్, మహేశ్ శర్మ సీఎం రేసులో ఉన్నారు. బాలిక విద్యపై సమావేశం బాలిక విద్యపై నేడు ఢిల్లీలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ తొలి సమావేశం. సాంస్కృతిక ఉత్సవాలు తిరుపతిలో నేటి నుంచి రెండు రోజుల పాటు గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు. విద్యార్థులకు శిక్షణ బాసర ట్రిపుల్ ఐటీలో ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ. విజయ్ హరారే సెమీస్ ఢిల్లీ: విజయ్ హరారే ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్‌లో నేడు బెంగాల్‌తో తలపడనున్న జార్ఖండ్. -
టుడే న్యూస్ డైరీ
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం తెలంగాణ బీఏసీ సమావేశం. ఈ నెల 13న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వర్ష సూచన విశాఖపట్నం: తెలంగాణ, ఛత్తీస్గఢ్లపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ శనివారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది. యూపీలో బీజేపీకి మెజారిటీ వస్తుందని కొన్ని.. హంగ్ తప్పదని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్యే పోటీ ఉందని అకాలీ-బీజేపీ కూటమి మూడో స్థానానికి పరిమితమౌతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. నాగార్జున యూనివర్సిటీలో సదస్సు గుంటూరు: నేడు నాగార్జున యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సు. 'కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ' అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు జరగనుంది. మార్పులు లేవు ముంబై: ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు భారత జట్టులో మార్పులు లేకుండా.. అదే జట్టును కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ తెలిపింది. -
టుడే న్యూస్ డైరీ
► హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేసీఆర్. ► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ, టీడీపీపీ భేటీ ► టీ20 వరల్డ్ కప్: నేడు ముంబైలో జరగనున్న రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం. ► మహిళల టీ20 వరల్డ్ కప్: రెండో సెమీస్‌లో నేడు న్యూజీలాండ్‌తో తలపడనున్న వెస్టిండీస్ -
టుడే న్యూస్ డైరీ
► నేడు తెలంగాణ అసెంబ్లీలో 2014-15 కాగ్ నివేదిక. రాష్ట్రంలో కరువు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు, విద్యా విధానంపై నేడు సభలో చర్చించనున్నారు. ► నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ద్రవ్య వినిమయ బిల్లు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ► హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్‌పై నేడు ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ► విజయవాడ: నేడు ఎన్టీఆర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం. హాజరు కానున్న గవర్నర్. ► నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటన. ► టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజీలాండ్ జట్టు తలపడనుంది. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం ► మహిళల టీ20 వరల్డ్ కప్: నేడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. -
టుడే న్యూస్ డైరీ
► హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో తరగతుల బహిష్కరణ. ► ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో 56 మందికి పద్మ అవార్డుల ప్రదానం. ► కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ► నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు, ఆరోగ్య శాఖ పద్దులపై చర్చ. ► హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ► తెలంగాణలో నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ► టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో శ్రీలంక జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం